అధికారానికి దూరమైన ఆరునెలల్లోనే చంద్రబాబు పరిస్థితి రోజురోజుకు ఘోరంగా దిగజారిపోతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల కలిసి ఉన్నప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్ రాజ‌కీయాల‌ను తన కంటి చూపుతో శాసించి.. జాతీయ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నేడు నాటి సమైక్యరాష్ట్రంలోనే చెక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు పరిమితం అయిపోయారు. మాట మాట‌కు పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాట నేడు సొంత పార్టీ నేతలకే చెల్ల‌ని కాసుగా మారిపోయింది.

 

బాబు మాట అంటే సొంత పార్టీ నేతలే ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఇంకా ఘోరం ఏమిటంటే ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న‌ ఎమ్మెల్యేలు అయితే చంద్రబాబు పరువును ఘోరంగా తీసేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుండగా రాజధాని గ్రామాల్లోని టీడీపీ వ్యతిరేక రైతు వర్గం కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది.

 

అంటే ఇటు చంద్ర‌బాబు రౌండ్ టేబుల్ స‌మావేశం పెడుతుంటే అటు రాజధానిలో తమకు చంద్రబాబు సీఎంగా చేసిన అన్యాయాన్ని అఖిలపక్షం ముందు ఉంచుతామని రాజధాని గ్రామాల్లోని కొందరు రైతులు బాబును ఘోరంగా విమ‌ర్శిస్తున్నారు. ఇక బాబు త‌న రౌండ్ టేబుల్ స‌మావేశంలో మ‌ళ్లీ అవే పాచి లెక్క‌లు చెప్పారు. పాడిందే పాట‌రా పాచిప‌ళ్ల దాసురా ? అన్న‌ట్టు తాను రాజ‌ధానిని క‌ట్టాను... హైద‌రాబాద్‌ను క‌ట్టాను.. అన్ని పాత లెక్క‌లే మ‌ళ్లీ వ‌క్కానిస్తున్నారు.

 

బాబు ప్ర‌సంగాలు చివ‌ర‌కు ప్ర‌జ‌లకు ఏమో గాని సొంత పార్టీ నేత‌ల‌కే బోరింగ్ గా మారాయి. ఇక బాబుకు వ్య‌తిరేకంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ స‌మావేశానికి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ లాంటి వాళ్లు నేతృత్వం వ‌హించారు. వీళ్లు బాబును ఏకి ప‌డుస్తున్నారు. ఇక ఈ రౌండ్ టేబుల్ స‌మావేశానికి వ‌చ్చిన క‌మ్యూనిస్టులు కూడా బాబు ఐదేళ్లుగా చేసిన అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశానికి వ‌చ్చిన స్పంద‌న కూడా బాబు స‌మావేశానికి రాలేదంటే బాబు స్థాయి ఎలా ప‌డిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: