దిశ తండ్రి తన కూతురు తప్పిపోయిందని పిర్యాదు చేయడానికి వెళ్తే... 3 పోలీసు స్టేషన్ల అధికారులు.. మా పరిధి కాదంటే.. మా పరిధి కాదంటూ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేసారు. ఎట్టకేలకు కొన్ని గంటల తరువాత మిస్సింగ్ కేసుని నమోదు చేసారు కానీ అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. దీంతో, పాపం దిశ నాన్న... పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి... తన కూతురిని వెతకడానికి వెళ్ళినట్లైతే దిశ బ్రతికేదంటూ వాపోయాడు. అప్పట్లో.. ఆ తండ్రి ఆవేదన అందర్నీ కలిచివేసింది.

 

ఈ క్రమంలోనే జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఉందని... దాని గురించి పోలీసు అధికారులకే తెలియదని స్పష్టం అయింది. చిన్న మాటలో చెప్పాలంటే... కొంతమంది పోలీసు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి... 'మా పరిధి కాదు' అనే అష్రాన్ని వాడుతారు. కానీ దిశ ఘటన తరువాత మా పరిధి కాదు అనే మాట పోలీసులు చెప్పకుండా ఉండాలని... ప్రభుత్వం 'జీరో ఎఫ్ఐఆర్'ని అమలు చేసి ... ప్రజలకు ఏదేనా సమస్య వస్తే వెంటనే కేసును నమోదు చేయడానికి... 'జీరో ఎఫ్ఐఆర్'ను వినియోగించుకోండి అని కోరింది.

అయితే అలా ప్రభుత్వం ప్రకటించిన 4 రోజుల తర్వాత... కృష్ణా జిల్లా నందిగామ సబ్‌డివిజన్‌ పరిధిలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వీరులపాడు మండలం రంగాపురంకు చెందిన రవినాయక్‌... తన కుమారుడు కిడ్నాప్ కు గురయ్యాడని పిర్యాదు చేయడం కొరకు కంచికిచర్ల పోలీసులు స్టేషన్ కు వెళ్ళాడు. అయితే ఆ బాలుడు కిడ్నాప్ కేసు... తమ పరిధిలోకి రానప్పటికీ... కంచికిచర్ల పోలీసులు... రవినాయక్ ఫిర్యాదును తక్షణమే జీరో ఎఫ్‌ఐఆర్‌ గా నమోదు చేసి.. విచారణ చేపట్టారు. రెండు బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు... అతి తక్కువ సమయంలోనే బాలుడి ఆచూకీని తెలంగాణలోని మిర్యాలగూడ మండలం వీరంపాడులో కొనుగోన్నారు. ఆపై... బాలుడిని తండ్రి రవినాయక్ కు సురక్షితంగా అప్పగించి.. కిడ్నాప్ కేసు క్లోజ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: