ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఆరేళ్లు గడిచింది. 2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేశారు. కానీ గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా అవినీతిలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా ప్రకటించారు.
 
2015 సంవత్సరంలో అక్టోబర్ నెల 22వ తేదీన ప్రధాని మోదీ అమరావతికి శంఖుస్థాపన చేశారు. ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం ఏకంగా 33 వేల ఎకరాల భూమిని సేకరించింది. గడచిన ఐదు సంవత్సరాల్లో అమరావతిలో టీడీపీ హైకోర్టు, సచివాలయం లాంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిందే తప్ప అమరావతిలో చంద్రబాబు శాశ్వత నిర్మాణాలను మాత్రం నిర్మించలేదు. వేల కోట్లు ఖర్చు అయినట్లు చంద్రబాబు చెబుతున్నా ఆ లెక్కలు నంబర్లలో కనిపిస్తున్నాయే తప్ప అభివృద్ధిలో మాత్రం కనిపించటం లేదు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పటంలో విఫలమైంది. కేంద్రానికి నిధుల వినియోగ ధ్రువపత్రాన్ని కూడా సమర్పించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే రాజధాని ఎక్కడ అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. అమరావతిని ఐదేళ్లలో అభివృద్ధి చేయని చంద్రబాబు రాజధాని ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉండటం చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. 
 
ప్రజలందరూ కూడా అమరావతిని రాజధానిగా వద్దనుకుంటే చేసేదేమీ లేదని చంద్రబాబు చెబుతున్నారు. అమరావతి ప్రాజెక్టు తప్పని అంటే తాను క్షమాపణ చెబుతానని చంద్రబాబు అన్నారు. కానీ చంద్రబాబు గడచిన ఐదు సంవత్సరాల్లో అమరావతిని అభివృద్ధి చేయలేదని రైతులకు, కూలీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని రైతులు కొందరు చంద్రబాబుపై అమరావతి పర్యటనలో రాళ్లు, కర్రలతో దాడులు చేయటం గమనార్హం. అమరావతి పర్యటనలో తనపై దాడి జరగటంతో చంద్రబాబు ఈరోజు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: