ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతంలో ఘోరంగా రేప్ చేయబడి హత్య గావింపబడ్డ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు పై మన దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇక ఆమెను ఘోరంగా అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసిన నిందితులకు ఉరే సరైనదని, వీలైనంత త్వరగా ఆ నీచులను ఉరి తీయాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం పై కూడా నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎందరు నేతలు మారుతున్నా, ఆడవారి పట్ల రోజు రోజుకు ఇటువంటి దాడులు మాత్రం ఆగడం లేదని, 

 

ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు అత్యంత కఠినమైన చట్టాలు చేయాలని పలువురు ప్రజా మరియు మహిళా సంఘాల వారు కోరుతున్నారు. ఇక ఈ ఘటనలో అత్యంత కీలకమైన దిశా సెల్ ఫోన్ ని నేడు సిట్ అధికారులు కనుగొన్నారు. మూడురోజులుగా పోలీసుల విచారణలో ఉన్న నిందితులు, సెల్ ఫోన్ ఎక్కడ పాతి పెట్టారో చెప్పడం జరిగింది. ఇక నిందితులు ఇచ్చిన వివరాల మేరకు ఘటనా స్థలానికి వెళ్లి పాతిపెట్టిన ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు, అందులో నిందితులతో ఆమె మాట్లాడిన కాల్ డీటెయిల్స్ ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కాల్ డీటెయిల్స్ ప్రకారం, నిందితుల్లో ఒకడైన ఆరిఫ్ పాషా, దిశను టైర్ పంక్చర్ షాప్ విషయమై ఎంతో సున్నితంగా మాయమాటలతో నమ్మించిన పద్దతిని విని సిట్ అధికారులు షాకైనట్లు సమాచారం. ఇక సెల్ ఫోన్ తో పాటు వారు వినియోగించిన లారీని క్లూస్ టీమ్ పరిశీలించి దిశా తల వెంట్రుకలను సేకరించడం జరిగిందట. 

 

ఇక ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు సిట్ అధికారులు మొత్తం ఏడు పొలిసు బృందాలను ఏర్పాటు చేసి, ఆధారాలను వీలైనంత త్వరగా సేకరించేలా ప్రయత్నిస్తున్నారు. ఇక సాక్ష్యాల సేకరణ అనంతరం నిందితులు ఏ విధంగానూ బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పలు కేసులు కూడా నమోదు చేసి కఠినంగా వారికి శిక్షలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఇక దిశా మరణంతో ఆమె కుటుంబసభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించి వారికి గుండె ధైర్యం చెప్తున్నారు. ఎంతైనా చేతికి అందొచ్చి, త్వరలో పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపవలసిన అమ్మాయికి ఈ విధంగా జరగడం ఎంతో శోచనీయం అని అంటున్నారు పలువురు ప్రజలు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: