దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. స్వయానా దిశ తండ్రి పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే తమ కూతురు బ్రతికేదని వ్యాఖ్యానించడంతో పోలీసులపై పలువురు విమర్శలు చేశారు, దీనితొ ముగ్గురు పోలీసులను విధుల్లో అలసత్వం వహించారంటూ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తమపై వచ్చిన విమర్శలకు తగిన రీతిలో సమాధానం చెప్పాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

కోర్టు నిందితులను వారం రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి రెండు గంటలకు నిందితులను అత్యంత రహస్యంగా ఘటన స్థలికి తీసుకువెళ్లారు పోలీసులు. ఘటన ఎలా జరిగింది, దిశ స్కూటర్ ఏవిధంగా తీసుకు వచ్చింది, స్కూటరుకు పంక్చర్ వేయించడానికి ఎటు తీసుకువెళ్లారు, ఏ ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డారు, హత్య ఎలా చేశారు, శవాన్ని ఎటు వైపుగా తీసుకెళ్లారు ఇలా రకరకాల ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి క్రైమ్ సీన్ ను రీ కంస్ట్రక్ట్ చేయించారు. నిందితులు తాము చేసిన ఘోరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. 

 

నిందితులు వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు లారీలో, అండర్ బ్రిడ్జి దగ్గర క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. లారీ క్యాబిన్ లో డ్రైవర్ వైపు కాకుండా మరో పక్క ప్రాంతంలో రక్తపు ఆధారాలు సేకరించారు ఇది ఎవరి రక్తమో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు ఇక అలాగే దిశ ను హత్య చేసిన ప్రాంతంలోనూ కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు.

 

50 మంది పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి తమకు తాము ఏ విషయాల్లో దర్యాప్తు చేయాలో నిర్ధేశించుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు దిశ సెల్ ఫోన్ ను తవ్వి తీశారు. ఇక గురువారం ఉదయం నుంచే పోలీసులు నిందితులను విచారిస్తున్నా, మీడియా నిందితుల గురించి అడుగగా కోర్టు నుంచి నిందితుల కస్టడీకి సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పి ఆశ్చర్యానికి గురిచేసారు. ఈ సమాధానంతో పోలీసులు నిందితులు విచారణను అత్యంత రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పోలీసులు మాత్రం కేసులో తమ చొరవతో వహ్వా అనిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: