పశు వైద్యురాలు దిశ హత్యతో దిశ పని చేసిన కొల్లూర్ గ్రామ ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. దిశ తమ మధ్య లేదన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మీడియా సంస్థ కొల్లూర్ గ్రామం సందర్శించి దిశ పని చేసిన పశువుల ఆస్పత్రికి వెళ్లి, ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న అటెండర్ ను పలకరించింది. 

 

దిశ గురించి ఆస్పత్రి అటెండర్ "సార్ మా దిశ మేడం గారు చాలా మంచివారు. రోజు శంషాబాద్ నుంచి మా గ్రామానికి ఆస్పత్రికి వచ్చి విధులు నిర్వహించి వెళ్లే వారు. గ్రామం దగ్గరకు రాగానే మేడం గారు నాకు ఫోన్ చేసేవారు నేను వెళ్లి మేడం గారిని ఆస్పత్రి దగ్గరకు తీసుకుని వచ్చేవాడిని. రోజు 9.30 కల్ల ఆస్పత్రికి వచ్చేవారు. సాయంత్రం వరకూ ఉండి 3 గంటలకు ఇంటికి వెళ్లేవారు. మేడం గారిని బుధవారం (నవంబర్ 27) రోజు చివరి సారిగా చూసాను, ఆరోజే నాతో చివరిసారిగా మాట్లాడారు.

 

సర్వర్ నేను రేపు రాను నాకు ఆఫీసులో మీటింగ్ ఉంది ఆస్పత్రిని జాగ్రత్తగా చూసుకో" అని మేడం గారు చెప్పి 2.30 గంటలకు ఆస్పత్రి నుంచి వెళ్ళిపోయారు. రేపు రానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్తారని అస్సలు అనుకోలేదు అంటూ కంటతడి పెట్టుకున్నారు అటెండర్. దిశ మేడం చాలా మంచివారు మా కుటుంబ సభ్యురాలిగా ఉండేవారు. ఊళ్ళో ఎప్పుడైనా పశువులకు సమస్య వస్తే రాత్రి 10 గంటలకు ఫోన్ చేసినా ఓపిగ్గా విని సమాదానం చెప్పేవారు అంటూ ఆస్పత్రి అటెండర్ చెప్పారు. 

 

"నన్ను మేడం గారు సర్వర్ అని పిలిచేవారు, డబ్బులు ఇబ్బంది ఉన్నప్పుడు అడిగితే ఇచ్చేవారు మళ్ళీ తీసుకెళ్లి ఇస్తే వద్దులే ఉంచుకో అనేవారు, మేడం గారి ఇంట్లో ఫంక్షన్లకి కూడా వెళ్ళాను, బాగా చూసుకునే వారు, అటెండర్ డాక్టర్ అంటూ బేధం చూపించేవారు కాదు. మేడం గారు చనిపోయిన రోజు వాళ్ళ నాన్న, చెల్లి నన్ను గట్టిగ పట్టుకుని ఏడ్చేశారు, అ విషయం తలచుకుంటేనే నా కన్నీళ్లు ఆగట్లేదు" అంటూ ఏడ్చేశారు అటెండర్. 

 

మా మేడం గారిని హత్య చేసిన ఆ కొడుకులను నడి రోడ్డు మీద ఉరి తీయాలి. తొక్క తోటకూర అంటూ టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఉరి తీయండి మళ్ళీ ఇంకోసారి అలా చెయ్యాలనే ఆలోచన ఇంకెవ్వరికి రాకుండా ఆ కొడుకులని ఉరి తియ్యాలి సార్ అంటూ ఆసుపత్రి అటెండర్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: