శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన హత్య చేసిన రేపిస్టులకు తగిన శాస్తి జరిగింది. రేపిస్టులు మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దిశ కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే వారిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది.

 

 

నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించినందు వల్ల ఎన్ కౌంటర్ చేసినట్టు పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చాయి.

 

నిందితుల విచారణ సమయమలో ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు నిందితులను తమకు అప్పగించాలని నిరసన చేసిన సంగతి తెలిసిందే. దిశను కాల్చిన చోటే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇదే సమయంలో దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ విషయం తలచుకుంటే దాదాపు 11 ఏళ్ల కింద.. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ గుర్తొస్తుంది. అప్పుడు కూడా వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు.

 

ఇప్పుడు దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ కూడా సజ్జనార్ నేతృత్వంలోనే జరిగింది. అసలు ఈ రేప్, అండ్ మర్డర్ ఉదంతం బయటకు వచ్చినప్పుడే ఇలాంటి ఎన్ కౌంటర్ జరగుతుందని భావించారు. ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పటికే ఈ ఎన్ కౌంటర్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ స్థలంలో పోలీస్ జిందాబాంద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ విషయంలో చట్టం పరిస్థితి ఎలా ఉన్నా.. దిశ కేసులో సత్వర న్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: