దిశ అత్యాచారం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఎంత అపురూపంగా పెంచుకున్నా ఆడపిల్లలపై కామాంధుల క‌ళ్లు పడుతూనే ఉన్నాయి. కామాంధులు, మృగాళ్ల‌ చేతుల్లో ఆడపిల్లలు లైంగీక దాడుల‌కు, అత్యాచారాలకు, హత్యలకు గురవుతూనే ఉన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్లను 20 సంవత్సరాలపాటు ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు.

 

వారికి అంద‌మైన భ‌విష్య‌త్తును ఇవ్వాల‌నుకుంటున్నారు.. కొంద‌రు ఆడ‌పిల్ల‌లు త‌ల్లిదండ్రుల క‌ళ్లు గ‌ప్పి ప్రేమ‌లు, దోమ‌లు అంటూ కొంద‌రి మ‌గాళ్ల వ‌ల‌లో ప‌డుతున్నారు. సహజంగానే టీనేజ్ వయసులో వయసు ప్రభావం, ఆకర్షణ ప్రభావమో గాని ఆడపిల్లలు ఆకర్షణకు గురవుతారు. అయితే ఇలాంటి వారి విషయంలో కొన్ని ప్రేమలు స‌క్సెస్ అవుతూ ఉంటాయి. ఆ పిల్ల‌లు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి వరకు తీసుకు వెళుతూ ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కూడా భర్త చేతిలో హింస‌కు గురైన‌ ఆడపిల్లలు ఉన్నారు.

 

అయితే అంతకంటే ముందే చదువుకునే వయసులో.. బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకునే టైంలో ప్రతి ఒక్క ఆడపిల్ల ఏం చేస్తుందో ? తల్లిదండ్రులు వారిని ఓ కంట‌ గమనించాల్సి ఉంది. ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు మారిపోయాయి. ఆడపిల్ల ఒంటరిగా ఇంటికి వెళితే సేఫ్ గా తిరిగి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒక ఆడపిల్ల బయటికి వెళితే కొన్ని వేల కోట్లు కళ్ళు ఆమెను గుచ్చిగుచ్చి చూస్తుంటాయి. ఇలాంటి టైమ్ లో ఆమెకు మంచి భవిష్యత్తు ఇచ్చేవరకు అయినా... ఆమెను ఓ భ‌ర్త చేతుల్లో పెట్టేంత వ‌ర‌కు అయినా ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులు త‌మ ఆడ‌పిల్ల‌ బయటకు వెళుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ఇక ప్ర‌తి ఒక్క ఆడ‌పిల్ల త‌ల్లిదండ్రులు సమాజం పట్ల, కుటుంబం పట్ల ఆడపిల్లలకు ఉన్న బాధ్యత ఆమె గుర్తెరిగేలా...  సంస్కృతి, సంప్ర‌దాయాలు పాటించేలా నైతిక విలువలతో పెంచాల్సి ఉంది. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా దిశ లాంటి వాళ్ల విష‌యంలో కొన్నిసార్లు జ‌ర‌గ‌రాని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. అలాంటి సంఘ‌ట‌న‌లు వ‌దిలేస్తే వ‌య‌స్సు కొచ్చిన ఆడ‌పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపుతున్న‌ప్పుడు ఫోన్ ఇవ్వ‌డం, అనువుకాని ప్ర‌దేశాల వ‌ద్ద‌కు ఒంట‌రిగా పంప‌క‌పోవం.. రాత్రి వేళ‌ల్లో తోడుగా వెళ్ల‌డం లాంటివి చేయాలి.  ఇలా ఆడ‌పిల్ల‌ల విష‌యంలో వారు త‌మ‌కు తాముగా ప‌రిపూర్ణ జ్ఞానం సాధించే వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలోనూ త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌లు పాటించాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: