దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృస్టించిన దిశ ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల‌ను క‌లిచి వేసిన విష‌యం తెలిసిందే. తాగిన మ‌త్తులో మృగాళ్ళు వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ పై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి స‌జీవంగా ద‌హ‌నం చేశారు. ఈ ఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచ మంతా త‌ల్లడిల్లిపోయేలా చేసింది. ఆ మృగాళ్ళ‌కు త‌గిన శిక్ష ప‌డాల‌ని ప్ర‌జా సంఘాలు పోరాడాయి. కొవ్వొత్తుల‌తో ర్యాలీలు కూడా జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉద‌యం 3.30 గంట‌ల స‌మ‌యంలో వారిని ఎన్ కౌంట‌ర్ చేశారు. 

 

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు.

 

కాగా.. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురూ తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. దీంతో.. వారిపై.. కాల్పులు జరిపక తప్పలేదని.. నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఎన్‌ కౌంటర్ జరిగింది. తెల్లవారు జామున 3 నుంచి 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌ కౌంటర్ జరిగినిట్టు సమాచారం.

 

అయితే ఇక పోలీసులు సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కి తీసుకెళ్ళారా?  లేక ముందుగానే కావాల‌నే తీసుకెళ్ళారా? పోలీసులు కావాల‌నే ఎన్‌కౌంట‌ర్ ప్లాన్ చేశారా? ప‌్లాన్ చేసి క‌రెక్ట్‌గా దిశ ఎక్క‌డైతే చ‌నిపోయిందో అక్క‌డికే తీసుకువెళ్ళి మ‌రి ప్లాన్ చేసి ఎన్ కౌంట‌ర్ చేశారా? కావాల‌ని అదే చోటులో ఎన్‌కౌంట‌ర్ జ‌రిపారా? ఇలా ఎన్నో విష‌యాలు అంద‌రిలో మెదులుతున్నాయి. 

 

అయితే.. అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా.. సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉండగా.. యాసిడ్ అటాక్ నిందితుల్ని కూడాఈ విధంగానే ఎన్‌కౌంటర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: