దిశ అత్యాచారం, స‌జీవ ద‌హనం కేసు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న రేకెత్తిచ్చింది. న‌వంబ‌ర్ 27న జ‌రిగిన ఈ సంఘ‌ట‌న పై దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. దిశ‌కు ప‌ట్టిన గ‌తే నిందితుల‌కు విధించాల‌ని దేశంలోని ప్ర‌ముఖ వ్య‌క్తుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు, సామాన్య జ‌నం నుంచి దేశ ప్ర‌థ‌మ పౌరుడి వ‌ర‌కు ముక్తకంఠంతో కోరుకున్నారు. కొంద‌రు సెల‌బ్రెటీలు అయితే ఏకంగా ఈ నిందితుల‌ను మాకు అప్ప‌గించండి.. మేము వారి అంతు చూస్తామ‌ని హెచ్చ‌రించారు. అయినా కూడా తెలంగాణ పోలీసులు ప‌క్కా చ‌ట్ట ప‌రిధి మేర‌కు న‌డుచుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. 

 

అందుకే కేసును న‌మోదు చేసిన పోలీసులు నిందితుల‌ను కోర్టులో ప్ర‌వేశ పెట్టారు. కోర్టు నిందితుల‌ను చ‌ట్ట‌ప్ర‌కారం జైలుకు రిమాండ్‌కు పంపింది. అదే విధంగా ప్ర‌భుత్వం కూడా ఈ కేసులో స‌త్వ‌ర కేసు విచార‌ణ కోసం చ‌ట్ట ప‌రిధి మేర‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. దీనికి తోడు పోలీసులు కూడా చ‌ట్ట ప్ర‌కారం కేసును ముందుకు సాగించే క్ర‌మంలో నిందితుల‌ను విచార‌ణ కోసం క‌ష్ట‌డిని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పోలీసుల క‌ష్ట‌డికి అప్ప‌గించింది.

 

అయితే ఇక్క‌డ మ‌నం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్క‌డ ఏది జ‌రిగినా చ‌ట్ట ప్ర‌కార‌మే జ‌రిగింది. ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్లుగా ఏది చ‌ట్ట విరుద్ధంగా జ‌రుగ‌లేదు. అయితే ఇక్కడ ప్ర‌స్థావ‌న ఆంశం ఏమిటంటే.. చ‌ట్టం. శిక్ష‌. భార‌తీయ చ‌ట్టంను ఆనాడు బ్రిటీషర్ల కాలం నాటిది. అయితే ఆనాటి చ‌ట్టంతోనే ఈనాటి నేర‌గాళ్ళు సులువుగా త‌ప్పించుకుంటున్నారు. అయితే ఈ బ్రిటీష‌న‌ర్ల కాలం నాటి చ‌ట్టం మార్చాల‌నే డిమాండ్ దిశ లాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిఇత‌న‌ప్పుడ‌ల్లా వినిపిస్తున్నాయి. 

 

అయితే ఇప్పుడు అదే వాద‌న మ‌రోమారు వినిపిస్తుంది. బ్రిటీష్ కాలం నాటి ఈ చ‌ట్టంను ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవ‌సరం ఉంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో అత్యాచారం చేసిన వారిన త‌ల న‌రికి వేయ‌డం, వెంట‌నే మ‌రణ దండ‌న విధించ‌డం, కాల్చి చంప‌డం వంటి చ‌ట్టాలు ఉన్నాయి. అలాంటి చ‌ట్టాలు సువిశాల‌మైన ఈ భార‌త దేశంలో కూడా తెస్తే.. అత్యాచారాల‌కు పాల్ప‌డే వారికి, హ‌త్య‌లు చేసేవారికి, హింసించే వారికి వెంట‌నే శిక్ష‌లు విధించ‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. 

 

భార‌త దేశంలో అత్యాచారాలు, హ‌త్య‌లకు పాల్ప‌డే వారిని వెంట‌నే ఎన్‌కౌంట‌ర్ చేసే చ‌ట్టం తేవాల‌ని, అందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని అనేక మంది నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ చ‌ట్టంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్చిన‌ప్పుడు స‌త్వ‌ర న్యాయం దొరుకుతుంద‌నే వాద‌న లేక‌పోలేదు. వాస్త‌వానికి ఆనాడు బ్రిటీష్ కాలంలో ఉన్న చ‌ట్టాలు ఆనాటి ప‌రిస్థితుల‌కు స‌రిప‌డి ఉండేవ‌ని.. అవి ఈనాటికి కొన‌సాగ‌డం వ‌ల‌న వాటితో ప్రయోజ‌నం లేకుండా పోతుందని.. అందుకే ఈ నాటి కాలానికి అనుగుణంగా చ‌ట్టాన్ని స‌వ‌రించుకోవాల‌ని నిపుణులు ప్ర‌జ‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టాల‌ను స‌వ‌రించాల్సిందేన‌ని ఈనాటి నిపుణులు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: