సమాజం అంటే ఓ నలుగురు వ్యక్తులు జీవించే వ్యవస్ద కాదు. నలభై మందితో చేసే ప్రయాణం కాదు. అలాగే రాజకీయం అంటే హోదా కాదు. డబ్బు సంపాదన అంతకంటే కాదు. ఇకపోతే చరిత్రను పరిశీలించినట్లయితే డబ్బుకు, అనవసరమైన ఆలోచనలకు, కామ, క్రోధ, మోహ, మద మాత్సర్యాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, తమ జీవితాలను సమాజానికి అంకితం చేసిన వారెందరో ఉన్నారు. సమాజంలో జరుగుతున్న వివక్ష మూఢ నమ్మకాల నిర్మూలన కోసం, సమ సమాజ ఏర్పాటు కోసం, అభివృద్ధి కోసం పోరాడి తమ ప్రాణాలను ధారపోసిన సంఘ సంస్కర్తలెందరో వున్నారు.

 

 

సమాజంలోని ప్రతి వ్యక్తీ ఆ కోణంలో ఆలోచించి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. అందుకే తమ జీవితాలను సమాజానికి అంకితం చేసి, ఎలాంటి డబ్బును ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం సంఘ సంస్కర్తల్లా పని చేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడాలి. ఇకపోతే ఒంటరిగా మనిషి ఏ అడవిలోనో, ఎడారిలోనో జీవించలేడు. సాటి మనిషికి తోడుగా... సాటి పౌరుల సహాయ సహకారాలతో... ప్రేమాభిమానాలతో కలిసి మెలిసి బ్రతకాలని కోరుకుంటాడు. అలా ఒకచోట... కొంతమందితో కలిసి జీవనయానాన్ని సాగించడాన్నే ‘సమాజం’ అంటారు.

 

 

మనిషికీ ఈ సమాజానికీ మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదంటే ‘మనిషి లేనిది సమాజం లేదు... సమాజం లేకుండా మనిషి ఉండలేడు’ అన్నంతగా,  ఒక సమాజం... అది చిన్నది కావచ్చు ‘‘పెద్దది కావచ్చు’’ అందులో ఆడ, మగ, పెద్ద, చిన్న, కులం, మతం అన్న భేదభావాలు ఉండవు. భిన్నత్వంలలో ఏకత్వం’ అన్నట్లు అందరూ కలిస్తేనే సమాజం! ఇలాంటి సమాజంలో సంస్కారం అతి ముఖ్యమైనది. మనపెద్దలను తీసుకుంటే గౌరవమర్యాదలతో సాటి ప్రాణులపట్ల దయతో మెలిగారు. అప్పుడు చెలరేగని విధ్వంసం నేటికాలంలో ఇంతలా జడలు విప్పుకుంటుందంటే మనిషి ఆలోచనల్లో, ఆచరణలో వచ్చిన మార్పు అని గ్రహించాలి. అందుకే కొన్ని గుణాలను చీమను చూసి నేర్చుకోవాలి. మృగాన్ని చూసి వదులుకోవాలి అంటారు పెద్దలు...

మరింత సమాచారం తెలుసుకోండి: