దిశపై అత్యాచారం హత్య కేసు దేశం మొత్తాన్ని కుదిపేసింది.  దేశంలోని ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చి ఈ హత్యను ఖండిస్తూ.. దిశకు న్యాయం చేయాలనీ కోరుతూ ఆందోళలన చేశారు.  పార్లమెంట్ ను సైతం ఈ ఘటన కుదిపేసింది.  దీంతో పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు.  ఎలాగైనా నిందితులను పట్టుకోవాలని అనుకున్నారు.  48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.  నిందితులను పట్టుకొని విచారించారు. పట్టుకున్న 24 గంటల్లోనే నిందితులను కోర్టుకు అప్పగించాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు అప్పగించగా, నిందితులను 14 రోజులపాటు రిమాండ్ విధించారు.  


నలుగురు నిందితులను ఇంకా కొంత విచారణ చేయాలి కాబట్టి తప్పని పోలీసుల కష్టడికి ఇవ్వాలని కోరడంతో కోర్టు ఏడు రోజుల కష్టడికి అందించింది.  కాగా, నవంబర్ 5 వ తేదీన నిందితులను జైలులోనే విచారణ జరిపారు.  ఆ తరువాత నవంబర్ 6 వ తేదీ తెల్లవారుజామున నిందితులను చటాన్ పల్లి స్పాట్ కు తీసుకెళ్లి విచారణ చేస్తున్న సమయంలో పారిపోవాలని చూడటంతో అక్కడి నుంచి 500 మీటర్లు ముందుకు పారిపోయారు.  అదే సమయంలో పోలీసులు అలర్ట్ అయ్యి కాల్పులు జరిపారు.  


ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు.  నిందితులను ఇది తగిన గుణపాఠం అని చెప్పాలి.  నలుగురు నిందితులను ఎలాగైన పట్టుకొని శిక్షపడాలని చూసిన సంగతి తెలిసిందే. కానీ, గతంలో జరిగిన చాలా సంఘటనల్లో నిందితులు చట్టాలను అడ్డం పెట్టుకొని బయటకు వస్తున్నారు.  హ్యాపీగా బయట తిరుగుతున్నారు.  బాధితులకు మాత్రం సరైన శిక్షలు పడటం లేదు.  శిక్షలు పడకపోవడంతో.. బాధితులు నిరాశ చెందుతున్నారు.  


అయితే, దిశ కేసులో నిందితులకు సరైన శిక్షపడింది.  పది రోజుల్లోనే కేసును పోలీసులు ఎన్ కౌంటర్ తో ముగించారు.  ఈ ఘటన తరువాత రేప్ చేయాలనే ఆలోచన మృగాళ్లకు వస్తుందా అంటే కొంత వరకు రాదనే చెప్పాలి.  రేప్ చేయాలి చూసే మృగాళ్లకు ఇక ఆ ఆటలు సాగవు అని ఈ ఘటన ఒక సాక్ష్యంగా చెప్తున్నది.  రేపిస్టులకు ఇది తగిన గుణపాఠం అని చెప్పాలి.  ఇప్పటికైనా మార్పు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: