తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఇప్పుడు ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఇదంతా ఈ ఆపరేషన్ ఆర్గనైజ్ చేసి అత్యంత సీక్రేట్‌గా కధను నడిపించిన అధికారుల గొప్పతనం. ఒక చెడు చేసిన వారిని  పొగడవలసిన అవసరం లేదు. కాని ఒక మంచిపని చేసిన వారి పాదాలకు హోదామరచి నమస్కరించిన తప్పులేదు.

 

 

ఇప్పుడు దిశ విషయంలో తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి మచ్చలేదు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలుపరచిన ప్రతి బాధ్యత గల పోలీసు అధికారులకు జోహార్లు. ఇకపోతే 7సంవత్సరాల క్రితం నిర్భయను ఇదే రీతిలో చంపిన కుక్కలను కూడా ఇదే విధంగా శిక్షిస్తే ఆ తల్లి ఆత్మ కూడా శాంతిస్తుంది అని అనుకుంటున్నారు యావత్ ప్రజానీకం. ఇకపోతే వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు  పోలీసులు.

 

 

హత్యాచార ఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దిశను సజీవదహనం చేసిన చోటే నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇకపోతే  డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాంగా ఏర్పడిన సిట్ ఇక ముందు ఇలాగే కొనసాగుతూ సమాజంలో ఉన్న కామాంధుల భరతం ఇలాగే పట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు..

 

 

నలుగురు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ తన పనితనాన్ని ఇంత త్వరగా చూపించి దేశవ్యాప్తంగా మన్ననలను పొందుతుంది. ఇకపోతే ఈ కమిటీని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య నాయకునిగా ఉండి ముందుకు నడిపించాడు. ఇక ఈ కమిటీ ఇప్పుడు ఏం చేస్తుందనేది ప్రకటించవలసి ఉంది.

 

 

ఈ కమిటీ ఇలాగే కొనసాగితే సమాజానికి పట్టిన చీడ మరింత తగ్గే అవకాశం కనిపిస్తుందంటున్నారు కొందరు ఆలోచన పరులు. వ్యవసాయం చేసేటప్పుడు పంటకున్న చీడ తొలగాలంటే పురుగుల మందును వాటిపై చల్లుతాం. అలాగే సమాజంలో ఉన్న చెడు తొలగాలంటే మరింతగా మనిషి మనసులనే నేలను చదును చేయవలసి ఉంది. ఏది ఏమైన త్వరగా దర్యాప్తును పూర్తిచేసి నిందితులకు తగిన శిక్షవేసిన సిట్ బృందాన్ని అభినందించవలసిందే అంటున్నారు లోకంలోని ప్రజలు...

మరింత సమాచారం తెలుసుకోండి: