దేశవ్యాప్తంగా దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం అవుతోంది. స్వీట్లు పంచుకుంటూ, టపాసులు కాల్చుకుంటూ ప్రజలు సంతోషం తెలుపుతున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలివస్తున్నారు. సీపీ సజ్జనార్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల విషయంలో పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, పోలీసుల సాహసాన్ని స్వాగతిస్తున్నారు. 
 
కానీ నిందితుల కుటుంబ సభ్యులు మాత్రం ఎన్ కౌంటర్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య మాట్లాడుతూ " ఇలాంటి కేసులు ఎన్నో జరిగాయని చెప్పారు. దిశ ఫోన్ తన చెల్లికి చేసే బదులు వేరే ఎవరికైనా చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు. ఒక అమ్మాయి కోసం నలుగురు ప్రాణాలు తీయడం తప్పు అని చాలా పెద్ద తప్పు అని చెన్నకేశవులు భార్య చెప్పారు. 
 
కోర్టు తీర్పు చెప్పకముందే పోలీసులు చంపేశారని నిందితులను ఎన్ కౌంటర్ చేయడం న్యాయం కాదని అన్యాయం అని చెప్పారు. మా ఆయనను ఎక్కడ చంపారో నన్ను కూడా అక్కడకు తీసుకొనివెళ్లి చంపండి" అని చెన్నకేశవులు భార్య చెప్పారు. అరీఫ్ తల్లి పోలీసులు తమ కొడుకులను కావాలనే చంపేశారని చెప్పారు. నిందితులకు శిక్షలు విధించటానికి కోర్టులు ఉన్నాయని చట్టపరంగా శిక్షలు విధించడమే సమంజసం అని అన్నారు. 
 
టాలీవుడ్ సెలబ్రిటీలు పోలీసులు దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. దిశ కేసు నిందితులకు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నారు. వైద్యులను పోలీసులు చటాన్ పల్లి వంతెన ప్రాంతానికి పిలిపించారు. ఆర్డీవో సమక్షంలో శవపంచనామా నిర్వహించి ఆ తరువాత మృతదేహాలను నిందితుల కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి రుజువైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసులపై పూలు చల్లుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: