తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమీక్ష నిర్వహించడం జరిగింది. దుమ్ముగూడెం వద్ద అటు జలవిద్యుత్ ఉత్పత్తికి, ఇటు గోదావరి నీటి నిల్వకు ఉపయోగపడే విధంగా బ్యారేజీ నిర్మించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కోరడం జరిగింది. ఈ రెండు పనులకు వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవాలని ఆదేశించడం జరిగింది. వీటితో పాటు కంతనపల్లి బ్యారేజీ పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని సూచించడం జరిగింది.

 

దుమ్ముగూడెం వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉంది. 150 రోజుల పాటు నీటి ప్రవాహం ఉంటుంది. జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఈ సానుకూలతల నేపథ్యంలో 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజి, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీలైనంత తక్కువ భూ సేకరణతో, నదిలోనే నీళ్లు ఆగేలా బ్యారేజిని డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వెంటనే అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు పిలవాలని కోరడం జరిగింది.
  
మిడ్ మానేరుకు మూడు టీఎంసీలు లిఫ్టు చేసి, అక్కడి నుంచి మల్లన్న సాగర్‌కు రెండు టీఎంసీలను పంపించాలని నిర్ణయించారు. ఈ రెండు పనులకు కూడా ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. దుమ్ముగూడెం బ్యారేజీ, మిడ్ మానేరుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే పనులకు మొత్తం రూ.13,500 నుంచి రూ.14,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

 

 రాష్ట్రాన్ని ఆరేడు ఇరిగేషన్ జోన్లుగా విభజించుకోవాలని, ఒక్కో జోన్​కు ఒక్కో ఈఎన్సీ ఇంఛార్జీగా వ్యవహరించి, తన పరిధిలోని నీటి పారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని కోరారు. నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని ఖరారు చేయాలని తెలిపారు. 


 
ఈ వర్క్​ షాపులోనే రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్టులు, చెరువులకు సంబంధించిన అన్ని వివరాలలతో సమగ్రమైన జాబితా తయారు చేయాలని సీఎం కోరారు. అన్ని ప్రాజెక్టులు, పంపుహౌజులు, లిఫ్టులు, కాల్వలు, చెరువుల నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మ్యాన్యువల్స్ అదే వర్కుషాపులో ఖరారు చేయాలని సీఎం తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: