దిశ హత్యకేసులో నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. వెటర్నరీ వైద్యురాలు దిశ ఎక్కడ మృతి చెందిందో అక్కడే అక్కడే ఆ నిందితులు కుక్క చావు చచ్చారు. సీన్ రికర్రెక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు పారిపోడానికి ప్రయత్నించగా నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు. 

 

వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోసి ఆ నిందితులు కాల్చేశారు. అయితే అదే ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 

 

అయితే ఎన్కౌంటర్ జరిగిన షాద్‌నగర్‌లోని చటాన్ పల్లిలో పడివున్న మృతులు డెడ్ బాడీలకు క్లూస్ టీమ్ కాసేపటిక్రితం శవ పంచనామా పూర్తి చేసింది. డెడ్ బాడీలకు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. క్లూస్ టీమ్ 8 గంటలకు రంగంలోకి దిగగా ఆ తర్వాత క్లూస్ టీమ్ ఘటనా స్థలిలోకి ఎవరూ రాకుండా చుట్టూ టేప్స్ పెట్టి దర్యాప్తు సాగించింది. 

               

ఘటనా స్థలంలో ఉన్న రక్తపు మరకలు, బుల్లెట్లు, నిందితుల మృతదేహాలు పడివున్న తీరు, చుట్టుపక్కల వాతావరణం అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఫొటోలు, వీడియోలూ తీసింది. అలాగే అన్ని ఆధారాలను సేకరించింది. అనంతరం మృతదేహాలను మహబూబ్ నగర్ కు తరలించి మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్ మార్టం జరగనుంది. పోస్టుమార్టం తరువాత పూర్తి నివేదికను రెడీ చేస్తారు. కాగా ఘటనాస్థలానికి మృతుల కుటుంబ సభ్యులు బయల్దేరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: