దిశ హత్యాచారం కేసు.. ఈ కేసు గురించి ప్రతిఒక్కరికి కాదు దేశం మొత్తం తెలుసు. అతికిరాతకంగా ఒక వెటర్నరీ వైద్యురాలు దిశను అన్యాయంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమె శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కనీసం శవం కూడా దొరకకుండా ఒక ఆడపిల్లను అతికిరాతకంగా చంపినా ఘటనలో నిందితులు నిజం ఒప్పుకోగా ఆ నిందితులను రిమాండ్ లో ఉంచారు. 

 

అయితే నిన్న అర్ధరాత్రి అదే ఘటన స్థలంలో ఆ ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు. 

 

దీంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంగా 17 సంవత్సరాల క్రితం నటి ప్రత్యుషపై అత్యాచారం చేసి చంపినా వారిని పోలీసులు శిక్షించలేదు అని, ప్రజలు అప్పుడు ఇలా లేరని ప్రత్యుష తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఈ ఎన్కౌంటర్ పై స్పందిస్తూ 17 సంవత్సరాల క్రితం తన కుమార్తెను దారుణంగా హత్యాచారం చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. 

 

అయితే ఆ సమయంలో ఇంత టెక్నాలజీ, ప్రజల్లో ఇంత చైతన్యం, పోరాట పటిమ ఉండి వుంటే, తనకు కూడా న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ఉదయం ఆమెను కలిసిన మీడియాతో ప్రత్యూష కేసును ప్రస్తుతమున్న నిర్భయ చట్టాల పరిధిలోకి తీసుకుని వచ్చి, మరోసారి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

 

ఆత్యాచార నేరస్తులకు పడే శిక్షలపై చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చింది అని, దిశనే ఓ చట్టంగా తీసుకురావాలని సరోజినీ దేవి వ్యాఖ్యానించారు. పాలకులు ఇప్పటికైనా కదలాలని ఆమె అన్నారు. అయితే దిశా కేసు నిందితుల ఎన్కౌంటర్ ను ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ పోలీసులను గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: