నవంబర్ 27 వ తేదీన దిశపై అత్యాచారం, హత్య ఘటనపై దేశం యావత్తు దద్దరిల్లిపోయింది.  దేశం మొత్తం   ఈ సంఘటన పై ప్రతి పౌరుడు స్పందించాడు.  నిందితులను ఉరి తీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.  ఈ డిమాండ్ లకు తలొగ్గడమో లేదంటే... సంఘటనలు అలా కలిసిరావడమో తెలియదుగాని, దేశం మొత్తం నిందితుల విషయంలో ఎం చేయాలని  కోరుకుందో అలానే జరిగింది. డిసెంబర్ 4 వ తేదీన నిందితులను తమ కష్టడికి తీసుకున్నారు.  


రహస్య ప్రాంతంలో నిందితులను విచారించారు.  ఐదో తేదీన కూడా నిందితులను చర్లపల్లి జైలులోనే విచారించారు.  అలా విచారించిన  పోలీసులు నలుగురు నిందితులను చర్లపల్లి నుంచి అర్ధరాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలు నుంచి బయటకు తీసుకొచ్చి తోడుంపల్లి  దగ్గరకు అర్ధరాత్రి 1 గంటకు తీసుకొచ్చారు.  అక్కడి నుంచి తెల్లవారు  జామున 3:30 గంటల సమయంలో పోలీసుల టీం నిందితులను చటాన్ పల్లి తీసుకెళ్లారు.  


అక్కడ అండర్ పాస్ వద్ద విచారణ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు.  పోలీసుల దగ్గరి నుంచి ఆరిఫ్ గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నం చేశారు.  వెంటనే అలర్ట్ అయ్యిన పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  నిందితులు మొబైల్ ఫోన్  అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అని చెప్పి చెప్పడంతో పాటు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశారు.  


పారిపోవడానికి పోలీసులపై రాళ్లు రువ్వుతూ పారిపోయేందుకు ప్రయత్నం చేశారు.  అదే విధంగా పోలీసుల దగ్గరి నుంచి  లాక్కున్న గన్నులతో ఆరిఫ్, అలానే చెన్నకేశవులుఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు.  కానీ, పోలీసులు హెచ్చరించినా కానీ, వినకుండా ఫైర్ చేశారు.  దీంతో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు.  రాళ్లతో పాటుగా, ఫైరింగ్ చేయడంతో ఎన్ కౌంటర్ చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు.  ఏ 1 నిందితుడు ఆరిఫ్ మొదట ఎటాక్ చేశారని ఆ తరువాత చెన్నకేశవులు కూడా ఎటాక్ చేశారని పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: