దిశ కేసును పోలీసులు ఎన్ కౌంటర్ తో ముగించారు.  నవంబర్ 27 వ తేదీ రాత్రి 9:30  గంటల ప్రాంతంలో దిశను  ట్రాప్ చేసి, ఏమార్చి బలవంతగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసి హత్య చేశారు.  తోడుంపల్లి  టోల్ ప్లాజా వద్ద అత్యాచారం చేసిన నిందితులు... దిశను అక్కడి నుంచి లారీ కేబిన్ లో ఎక్కించుకుని లోపల కూడా అత్యాచారం చేశారు.  అక్కడి నుంచి చటాన్ పల్లి ఫ్లై ఓవర్ వద్దకు తీసుకెళ్లి అండర్ పాస్ బ్రిడ్జి కింద దిశను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు.  


దీంతో యావత్ భారత దేశం భగ్గుమంది.  నిందితులను పట్టుకోవాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. అటు పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి.  కాబట్టి ప్రొడ్యూస్ చేశారు. కాగా, నలుగురు నిందితులను తిరిగి పోలీసుల కష్టడికి ఇవ్వాలని కోరడంతో కోర్టు నిందితులను పోలీసులకు అప్పగించింది.  


అలా తమ కష్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారించడం మొదలుపెట్టారు.  4 వ తేదీన కొంత విలువైన సమాచారం సేకరించారు.  అక్కడి నుంచి 5 వ తేదీన కూడా కొంత సమాచారం సేకరించారు.  అయితే, కొన్ని వస్తువులు చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద దాచిపెట్టినట్టు నిందితులు చెప్పడంతో పాటుగా కేసుకు సంబంధించి రీ కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి నిందితులను 6 వ తేదీ అర్ధరాత్రి తోడుంపల్లి టోల్ ప్లాజా వద్దకు, అలానే, చటాన్ పల్లి ఫ్లై ఓవర్ అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి విచారించారు.  


ఎప్పుడైతే అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లారో అక్కడ నుంచి నిందితులు పోలీసుల దగ్గరున్న వెపన్స్ ను లాక్కొని కాల్పులు జరపడం మొదలుపెట్టారు.  ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నిందితులు నలుగురు మరణించారు. ఈ ఎన్ కౌంటర్ లో పోలీసులు మొత్తం 12 బుల్లెట్లు వినియోగించారు.  అందులో ఐదు ఆరిఫ్ శరీరంలోనుంచి దూసుకుపోయాయి.  దీనికి సంబంధించిన రిపోర్ట్ ను పోలీసులు రెడీ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: