ఇటీవల రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో హత్యకు గురైన దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై శుక్రవారం సాయంత్రం సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో  ఘటనపై పూర్తి వివరాలను తెలియచేశారు. దిశను హత్య చేసిన 24గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని.. 30న చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు.

 

నలుగురు నిందితులు మహ్మద్. శివ, నవీన్, చెన్నకేశవులను విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం చటాన్ పల్లి వద్దకు తీసుకువచ్చామని తెలియచేయడం జరిగింది. దిశకు చెందిన సెల్ ఫోన్, వాచీని ఎక్కడ దాచారని తెలుసుకునేందుకు నిందితులను తీసుకు వచ్చినట్లు తెలియచేయడం జరిగింది. ఆ సమయంలో నిందితులు గుంపుగా ఏర్పడి పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, అనంతరం పోలీసుల వద్ద రెండు వెషన్లను తీసుకొని కాల్చేంచేందుకు సిద్ధం అయ్యినట్లు తెలిపారు. సరెండర్ కావాలని ఎంత చెప్పినా వినకుండా దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారని సీపీ  వెల్లడించడం జరిగింది.

 

శుక్రవారం ఉదయం 5.45 నుంచి 6.15 సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులు చనిపోవడం జరిగింది అని తెలిపారు. నిందితులు జరిపిన దాడిలో ఎస్సై వెంకటేశ్వర్లు పాటు కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారని.... వారు ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియచేయడం జరిగిది. నలుగురు నిందితులను విచారిస్తున్న సమయంలో చాలా విషయాలు చెప్పారని.. వారిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు ఉన్నాయి అని సమాచారం. 

 

ఈ ఘటనపై లోతైన దర్యాపు జరుపుతామని స్పష్టం చేశారు. దిశ సెల్ ఫోన్, వాచీని చూపిస్తామంటూ పోలీసులను అటూ ఇటూ తిప్పుతూ పోలీసులపైకి దాడి చేశారని తెలియచేయడం జరిగింది. నిందితులు ఆరిఫ్. చెన్నకేశవుల దగ్గర రెండు వెపన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలియచేయడం జరిగింది . ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో నిందితుల డెడ్ బాడీలకు పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. దిశ కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా అందరూ అండగా నిలవాలని సీపీ కోరడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: