దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు, తాజా ఎన్కౌంటర్ పై అంతా హర్షం వ్యక్తం చేస్తుండగా ఓ మహిళా సంఘాల కూటమి నేతలు మాత్రం తీవ్రంగా ఖండించారు. నలుగురు చనిపోయిన ఈ ఘటన పై మండిపడ్డారు. పోలీసులు అబద్దం చెప్తున్నారు అని ఆరోపించారు.వారు విడుదల చేసిన ప్రకటన ఇది.

హైదారాబాద్ ఫేక్ ఎన్ కౌంటర్ మీద AIPWA (All india Progressive Women’s Association) ప్రకటన

 

మా పేరు మీద కష్టడీ హత్యలు వద్దు

 

హైదారాబాద్ రేప్ మరియు మర్డర్ కేసులో నలుగురు నిందితుల్ని ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో చంపేశారు. ఈ ఎన్ కౌంటర్, ఎన్ కౌంటర్ పేరుతో కష్టడీ హత్యకు ఉన్న అన్ని లక్షణాలను కలిగి ఉంది. ఆ రాత్రి అత్యాచారం, హత్య జరిగిన జరిగిన స్థలానికి వారిని తీసుకొని వెళ్లినపుడు పోలీసుల మీద దాడి చేయటం వలన చనిపోయారని చెప్పారు. అనుమానితులు పోలీసు కష్టడీలో ఉండటం, ఆ కారణంగా వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండకపోవటం- పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.

 

ఇప్పుడు దేశంగా మనందరికీ న్యాయం జరిగిందని చెబుతున్నారు. బాధితురాలి హత్యకు ప్రతీకారం జరిగిందంటున్నారు. రేపిస్థ్టులు చనిపోయారు కాబట్టి మన పోలీసులు, ప్రభుత్వం, సమాజం సరిగ్గా ఉన్నాయని గట్టిగా నమ్ముతూ మనం అందరం మన మన పనుల్లోకి వెళ్లిపోవచ్చు.

 

కానీ ఈ న్యాయం నకిలీది. ‘హత్యను’ న్యాయంగా చూపించే వ్యవస్థ ఎలాంటి దంటే అది ‘మహిళలకు వీధుల్లో భద్రత కల్పించలేము, మహిళలపై జరిగే నేరాలను విచారించి తప్పును రుజువు చేసేంత సాక్యాలను ప్రవేశపెట్టలేము, అత్యాచార బాధితులను రక్షించలేము (నిన్ను ఉత్తరప్రదేశ్ లో ఒక రేప్ బాధితురాల్ని సజీవ దహనం చేశారు), అత్యాచార బాధితులకు కోర్టులో గౌరవం కల్పించలేమని’ అని మహిళలకు చెబుతుంది.

 

వీళ్లు నలుగురు అనుమానితులే అనే విషయం మర్చిపోకూడదు. లాకప్పు ఒప్పుదలలు తప్ప, వీరు నిందితులని రుజువు చేసే సాక్ష్యం ఏమైనా ఉందో లేదో మనకు తెలియదు. ఈ ఒప్పుకోవడాలను భారతదేశంలో పోలీసులు అలవాటుగా హింస ద్వారా చేయిస్తారు. హింస ఎప్పుడు నిజాన్ని వెలికి తీయదు. కాబట్టి ఈ చనిపోయిన నలుగురు, హైదారాబాద్ డాక్టర్ ను నిజంగా హత్య చేసి చంపిన వారు అవునో కాదో తెలియదు.

 

ఇదే హైదారాబాద్ పోలీసులు, తమ కూతురి సంగతి తెలుసుకొనే విఫల ప్రయత్నం చేస్తున్న బాధితురాలి తల్లిదండ్రులను ఎగతాళి చేశారు. మహిళలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెబుతూ ఈ పని చేశారు. అంటే మహిళలు రాత్రి 8 తరువాత బయట తిరిగితే, రహదార్లను భద్రంగా ఉంచి తాము వారిని రక్షించలేమని వారికి చెప్పారు. అదే పోలీసు ఇప్పుడు రేపిశ్టులను పట్టుకొని శిక్షించామని మనల్ని నమ్మమంటున్నారు. వాళ్లే జడ్జిలుగా, న్యాయ సంఘంగా, తలారీలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక క్రూరమైన జోకు.

 

మహిళా ఉద్యమాలు ఇది న్యాయం కాదని మొదటిగా చెబుతాయి. పోలీసులు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు, తమ బాధ్యత దారిని మూసివేసే కుట్ర ఇది. బాధ్యత తీసుకొని మహిళల హక్కుల విషయంలో తన ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి మన ప్రశ్నలకు జవాబు ఇచ్చే బదులు- తెలంగాణ సీయం, పోలీసులు మూక దాడి హత్యలకు నాయకులుగా వ్యవహరిస్తున్నారు.

 

ఇలాంటి కష్టడీ మరణాలు తప్పదు అని వాదించేవారు ఇంకో సారి ఆలోచించండి. హైదరబాద్, తెలంగాణ పోలీసులు ఇలాంటి హత్యలకు చెడుగా పేరుబడ్డారు. 2008లో ఆసిడ్ దాడి కేసులో ముగ్గురిని కష్టడి హత్యకు గురి చేశారు. ఆ హత్యలు హైదారాబాద్, తెలంగాణ లేక భారతదేశంలో మహిళల మీద నేరాలను తగ్గించలేదు. యాసిడ్ దాడులు, అత్యాచారాలు, మహిళా హత్యలు ఎలాంటి శిక్షలు లేకుండా జరుగుతూనే ఉన్నాయి.

 

మేము ఈ ఎన్ కౌంటర్ విషయంలో పూర్తి విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఎన్ కౌంటర్ కు బాధ్యులైన పోలీసులను అరెష్టు చేసి, విచారణ చేసి, కోర్టులో హత్యకు గురి అయిన నలుగురిని ఆత్మ రక్షణార్ధం మాత్రమే చంపామని రుజువు చేసుకోమనాలి. ఇది మానవ హక్కులకే కాదు, మహిళల హక్కులకు కూడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎలాంటి జవాబుదారీతనం లేకుండా, ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొకుండా చంపగలగటం అంటే- వాళ్లు మహిళలను కూడా అత్యాచారం చేసి, ఎలాంటి ప్రశ్నలు ఉండవనే ధీమాతో చంపగలరు.

 

ఛత్తీస్ ఘర్ లో మీనా ఖల్ఖో సంగతి గుర్తుకు తెచ్చుకోండి. ఆమెను ఛత్తీస్ ఘర్ పోలీసులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. తరువాత మీనాను మావోయిస్టు గా ముద్ర వేస్తూ దానికి ఎన్ కౌంటర్ అనే రంగు పూశారు. జుడీషియల్ విచారణ అది సామూహిక అత్యాచారం, హత్యను కవర్ చేసే ఎన్ కౌంటర్ అని తేల్చింది. ఆ రేపిష్టుల మూక న్యాయ విచారణ ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది.

 

మేము ఈ కష్టడీ హత్యలను, మూక హత్యలను న్యాయంగా అంగీకరించం కాబట్టి చాలా టీవీ ఛానళ్లు, హిందుత్వ సామాజిక మాధ్యమ సైన్యాలు మహిళా ఉద్యమకారుల్ని శత్రువులుగా చెబుతాయి. ఈ ఛానళ్లు, ఈ సైన్యాలే గతంలో కఠువ కేసులో రేపిస్టులను సమర్ధిస్తూ చేసిన రాలీలను సమర్ధించాయి. ఆ రేపిశ్టులకు కోర్టులో శిక్ష పడిన తరువాత కూడా సమర్ధించాయి. వీళ్లే ప్రధాన న్యాయమూర్తి గొగోయి మీద లైంగిక వేధింపు ఫిర్యాదు చేసిన మహిళను అబద్దాలకోరు అన్నారు. వీళ్లే లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసిన జె ఎన్ యూ, జాదవ్ పూర్ విద్యార్ధునులను అసభ్య భాషలో అవమానించారు. వీళ్లే గాంగ్ రేప్ నిందితుడిగా ఉన్న కుల్దీప్ సెంగార్ ను సమర్ధించారు.

 

మేము, మహిళా ఉద్యమకారులం, మహిళలకు నిజమైన న్యాయం కొరకు పోరాడుతూనే ఉంటాము. మేము పోలీసులు వారి విధులను నిర్వర్తించాలనీ, మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని కోరుకొంటాము. వారిని జడ్జీలుగా, తలారీలుగా వ్యవహరించాలని కోరుకోము. పోలీసులు రేపిష్టులుగా ప్రకటిస్తూ హత్య చేసే పౌరాణిక ‘సామూహిక చేతన’ ను కోరుకోము. మేము మార్పు కోరుకొనే సమాజపు చేతనను ఆశిస్తాము. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో మహిళలకు అండగా ఉంటూ గౌరవంగా చూడటాన్ని కోరుకొంటాము. బాధితురాలిపైనే నింద, అత్యాచార సంస్కృతులను తిరస్కరించటంలో ఇంకా క్రియాశీలకంగా, జాగురుతతో ఉండాలని కోరుకొంటాము.

 

రతీ రావు – AIPWA అధ్యక్షురాలు

మీనా తివారీ – AIPWA ప్రధాన కార్యదర్శి

కవితా కృష్ణన్ – AIPWA కార్యదర్శి

మరింత సమాచారం తెలుసుకోండి: