దిశను నమ్మించి సహాయం చేస్తామని చెప్పి ఆమెను ఎత్తుకుపోయి పశువు కంటే హీనంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందితులకు పోలీసులు 48 గంటలలోపే పట్టుకున్నారు.  అలా నిందితులను పట్టుకున్న పోలీసులు వాళ్ళను కోర్టు ఆదేశాల మేరకు జైలు తరలించడం.. ఆ తరువాత కోర్టు అనుమతితో పోలీసులు కష్టడీలోకి తీసుకోవడం జరిగిపోయాయి.  పోలీసులు ఈ కేసును పూర్తిగా విచారించి ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో అప్పగించాలి అంటే కనీసం 50 రోజులు పడుతుంది.

 
ఈ కేసు ఎప్పటి వరకు తేలుతుందో తెలియదు అని, సాంకేతిల్లముగా పోలీసులు కేసును ఎంతవరకు ప్రూవ్ చేస్తారని అనుకుంటున్న సమయంలో నిందితులను డిసెంబర్ 4 వ తేదీన కష్టడీలోకి తీసుకున్నారు.  ఐదో తేదీన చర్లపల్లి జైలులోనే విచారించారు.  డిసెంబర్ 6 వ తేదీన కేసు రికన్స్ట్రక్షన్ చేయడానికి నిందితులను చటాన్ పల్లి దగ్గరకు తీసుకురాగా, పారిపోయేందుకు ప్రయత్నించారు.  


అంతేకాదు, పోలీసుల వద్ద ఉన్న తుపాకులు లాక్కొని పారిపోతుండగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు.  ఫలితంగా నలుగురు నిందితులు మరణించారు.  తెలంగాణ పోలీసులు చేసిన పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. బోర్డర్ లో ఉన్న సైనికుడైనా, సమాజంలో ప్రజలను రక్షించే పోలీసైనా సరే వాళ్లకు కావాల్సింది తమ డ్యూటీ చేయడమే.  తమ డ్యూటీని కరెక్ట్ గా చేసినపుడు పది మించి డ్యూటీ బాగా చేసావని మెచ్చుకుంటే దాని వలన వచ్చే ఆనందం మరొకటి ఉండదు. 


ఇదిలా ఉంటె, దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నజరానా ప్రకటించారు.  అయితే, ఈ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం కాదు, తెలంగాణ పోలీసులు కాదు.  హర్యానాకు చెందిన ఓ వ్యాపారవేత్త.  రాహ్ గ్రూప్ ఫౌండేషన్ ఈ నజరానా ప్రకటించింది.  ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తున్నారు రాహ్ గ్రూప్ చైర్మన్ నరేష్ సెల్ఫార్ పేర్కొన్నారు.  పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శించి నిందితులను ఎన్ కౌంటర్ చేశారని.  వారి తెగువ మెచ్చుకో తగ్గది అని చెప్పి చెప్పాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: