దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. వెటర్నరీ వైద్యురాలు దిశ ఎక్కడ మృతి చెందిందో అక్కడే ఆ నిందితులు ఎన్కౌంటర్ చేసి చంపారు. సీన్ రికర్రెక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు పారిపోడానికి ప్రయత్నించగా నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు. 

 

వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోసి ఆ నిందితులు కాల్చేశారు. అయితే అదే ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో నిందితులు మృతి చెందారు.  

 

అయితే ఆ నిందితులను ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. నిందితులను ఎక్కడైతే ఎన్‌కౌంటర్‌ చేశారో అక్కడే సీపీ మీడియాతో మాట్లాడారు. అయితే సజ్జనార్ మాట్లాడుతూ జరిగిన విషయాలన్నింటిని ఆ ఘటనకు సంబంధించిన విషయాలన్నీ ఒకటికొకటి వెల్లడించారు. 

 

తెల్లవారుజామున నిందితులను చటాన్‌పల్లికి తీసుకువెళ్లగా సెల్‌ఫోన్‌ అక్కడ, ఇక్కడ పెట్టామని చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే అదును చూసుకొని పోలీసులపై కర్రలు, రాళ్లతో నిందితులు దాడి చేయడం జరిగింది అని పోలీసుల వద్ద ఉన్న రెండు ఆయుధాలను నిందితులు లాక్కొని ఫైరింగ్‌కు ప్రయత్నించారని, పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితులు వినలేదు. పలుమార్లు హెచ్చరించిన తర్వాతే ఆత్మరక్షణ కోసం నిందితులపై ఫైర్‌ చేశామని సీపీ సజ్జనార్ వెళ్ళడించారు. 

 

కాగా ఆ నిందితులు ఘటంలో కూడా ఎన్నో నేరాలు చేసి ఉంటారని, కరుడుగట్టిన నేరస్తులు అని సీపీ సజ్జనార్ చెప్పారు. ఏ1 ఆరిఫ్‌ పాషా, ఏ4 చెన్నకేశవులు వద్ద రెండు ఆయుధాలను రికవరీ చేసినట్టు వేసల్లడించారు. కాగా ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి అని ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్ గౌడ్ కు గాయాలయ్యాయి అని తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సజ్జనార్ ముడై ముందు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: