దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. వెటర్నరీ వైద్యురాలు దిశ ఎక్కడ మృతి చెందిందో అక్కడే ఆ నిందితులు ఎన్కౌంటర్ చేసి చంపారు. సీన్ రికర్రెక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు పారిపోడానికి ప్రయత్నించగా నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు. 

 

వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోసి ఆ నిందితులు కాల్చేశారు. అయితే అదే ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో నిందితులు మృతి చెందారు.  

 

అయితే ఆ నిందితుల మృతుదేహాలకు కాసేపటి క్రితమే పోస్టుమార్టం జరిగింది. అయితే ఈ నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ ఎన్కౌంటర్ లో గుడిగండ్లకు చెందిన ముగ్గురు నిందితులు మృతిచెందారు. అయితే, గ్రామంలో అంత్యక్రియల కోసం పోలీసులు ఏర్పాట్లు చేశారు. వారి స్వగ్రామమైన గుడిగండ్లకు ఆ ముగ్గురు మృతదేహాలను తరలించనున్నారు. 

 

అయితే ఆ మృతుదేహాలను నేరుగా స్మశానానికే తరలించాలన్న ప్లాన్ చేసిన పోలీసులు దీనికి కుటుంబసభ్యులను కూడా ఒప్పించారు. అయితే, తమ పట్టా భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలులేదంటూ సంబంధిత భూమి పట్టాదారులు వెంకటమ్మ అడ్డుచెబుతున్నారు. ఇప్పటికే మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు గోతులను కూడా తీశారు, గ్రామ శివారులోని సర్వే నంబర్ 12లో ఏర్పాట్లు చేశారు. 

 

కానీ, మేక వెంకటమ్మ అనే మహిళ మాత్రం ఈ భూమి తమదని మా భూమిలో వీరి అంత్యక్రియలు ఏంటని అడ్డుచెప్పారు. స్మశానవాటికలో స్థలం ఉన్నా మా భూమిలో ఎందుకు తీస్తారని ఆమె అడ్డుతగిలారు. తమ భూమి నుంచి మృతదేహాలను కూడా తీసుకెళ్లేందుకు వీళ్లేదని వెంకటమ్మ అడ్డు చెప్తుంది దీంతో ఆ నిందితుల అంత్యక్రియలపై ఆలోచనలో పడ్డారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: