తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ఓ ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నింధితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లు తిరగబడటంతో ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్‌ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా ఈ ఘటనపై నటి, నిర్మాత మంచు లక్ష్మీ స్పందించారు. లక్ష్మి మాట్లాడుతూ... దిశకు జరిగిన అన్యాయం తెలిసినప్పటి నుండి నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఈ రోజు ఎన్  కౌంటర్ వార్త వినగానే ఒక మహిళగా, తల్లిగా చాలా సంతోషించాను. కానీ ఈ ఎన్‌ కౌంటర్ నిజమైన పరిష్కారమా..? అంటే మాత్రం చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఈ ఘటన లాగా అన్ని సంఘటనలు చూడలేము. ఇలాంటి పరిస్థితి అన్ని సందర్భాల లోనూ రావాలి.

 

చిన్నారి తల్లుల పై నుండి పెద్ద పండి పోయిన ముసలి వాళ్ళను కూడా ఈ మృగళ్ల కామ దాహనికి బలి తీసు కున్నారు. సమాజం సిగ్గుతో తలదించు కునేలా చేస్తు న్నారు.. అమ్మాయిగా ఉండాలంటే అందరికీ భయం వేస్తుంది.. ఎటిపక్కనుండి ఈ మృగం వచ్చి చంపు తుందో అని వల్ల అమ్మలు లాగే బయట ఆడవాళ్ళు ఉండరా అంటూ మంచు ప్రశ్నించింది..

 

ఆడ వాళ్ళ స్వేచ్ఛను అడ్డు  కోవడానికి, వారికి గీతలు గీయడానికి ఎవరికీ హక్కు లేదు. 80 శాతం రేప్‌లు బయటకు రావు..? ఫ్రెండ్లీ పోలీసింగ్ పెరగాలి. చట్టాలు మారాలి, ఆ మార్పులు వస్తాయి అంటే ఇండస్ట్రీని మొత్తాన్ని బయటకు తెస్తాను. చదువుకునే రోజుల నుండి ఒక మంచి నడవడికను ఆడ వాళ్ళకు అందించాలి అంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ అయ్యి చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి: