చివరికి హైదరాబాదులో ఘోరంగా అత్యాచారానికి గురై అతి కిరాతకంగా చంపబడ్డ దిశ హత్య కేసులోని నిందితులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అతి నాటకీయ పద్ధతిలో పోలీసులు ఈరోజు తెల్లవారుజామున నేరస్థులను ఎన్ కౌంటర్ పేరుతో మట్టు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. కుక్క తోక వంకర అన్నట్టు విచారణ సమయంలో అమ్మాయి ని చంపిన స్పాట్ దగ్గరకు తీసుకుని వెళ్లి కోర్టు వారికి అవసరమైన వివరాలు సేకరిస్తుండగా వారు పోలీసు వారి దగ్గరే ఒక గన్ను ని కాచేసి బెదిరించి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినట్లు పోలీసులు తెలిపారు.

 


అంతేకాకుండా పోలీసులపై రాళ్లు రువ్వడం మరియు తుపాకులతో కాల్పులు జరిపి బెదిరించడంతో తమ ఆత్మరక్షణ కై వారి నలుగురిని కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కొద్ది సేపటి క్రితమే ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించగా డాక్టర్లు పోస్టుమార్టంలో వారి బాడీ లలో వెనుక భాగంలో బుల్లెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే వారి శరీరంలో బుల్లెట్లు ముందు వైపు కాకుండా వెనక వైపు నుండి కూడా కొన్ని తగ్గినట్లు గుర్తించారు. సాధారణంగా ఎన్ కౌంటర్ చేసేటప్పుడు పోలీసులకి కొన్ని నియమాలు ఉంటాయి. 

 

రిమాండ్ లో ఉన్న ముద్దాయి వారి పై ఎదురు దాడి చేసినప్పుడు మాత్రమే వారు తమ ఆత్మ రక్షణకై వారిని హతమార్చాలని ఉంటుంది. అటువంటి సమయంలో అసలు కాల్చిన బుల్లెట్లు శరీరానికి ముందు భాగంలో తగిలి ఉండాలి కానీ వెనుక భాగంలో కాదు అన్నది ఇక్కడ లాజిక్. అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు వారిపై రాళ్లు విసిరేసి అక్కడి నుంచి దూరంగా పరిగెడుతూ మధ్య మధ్యలో తమ దగ్గర ఉన్న రివాల్వర్ తో కాల్పులు జరుపుతుండగా వారిని కాల్చినప్పుడు నిందితుడు వెనక్కి తిరగ్గానే వెనకభాగంలో బుల్లెట్లు తగిలాయట. ఇంకా ఎన్ కౌంటర్ విషయంలో అనేకానేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఒక విచారణ కమిటీని నియమించింది. త్వరలోనే మరిన్ని నిజాలు సాక్ష్యాధారాలతో బయట పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: