దిశా హత్య నిందితులను పోలీసులు విచారణ నిమ్మితం దిశా ను చంపినా చోటు కు తీసుకెళ్లారు ఆ సమయం లో వారు తప్పించుకునే ప్రయత్నం చేసారు అప్పుడు ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది అంటూ పోలీసుల చెప్పారు ..ఈ ఎన్కౌంటర్పై  ప్రజల్లో ఆనందం వెల్లువెత్తింది .దీనిపై వివిధ రంగాల్లో ఉన్న సెలెబ్రిటీలు కూడా ఆనందం వ్యక్తం చేసారు.

 

నిందితులని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. నాగార్జున, బాలకృష్ణ. చిరంజీవి, రవితేజ, నాని, కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, నితిన్, అఖిల్, సమంత లాంటి లాంటి సెలెబ్రిటీలంతా నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులని అభినందించారు. ...

 


దీనిపై ఎప్పుడు వివాదాస్పద వాక్యాలు చేసే చలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై స్పందించాడు. ఇటీవల రాంగోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రంతో తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

 

రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో.. 'సమాజంలో నెలకొన్న ఎమోషన్స్ ని, అగ్రహావేశాలని కంట్రోల్ చేయడానికి పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా చట్టాలని, నిబంధలని అమలు చేయాల్సి ఉంటుంది. కానీ కాబట్టి ఎన్ కౌంటర్స్ వల్ల  ఎటువంటి న్యాయం జరగదు.అవి పరిష్కారమార్గం కాదు, అని రాంగోపాల్ వర్మ సంచలన వాక్యాలు చేసాడు. దిశ కేసులో నిందితులని పోలీసులు ఎన్ కౌంటర్ చేసినందుకు సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.

 

దిశ పై అత్యాచారం, హత్య జరిగిన సమయంలో వర్మ నిందితులని శునకాలు అని సంభోదించారు. ఈ ఎన్ కౌంటర్   తో అయినా  ఇటువంటి చర్యలు  చేయడానికి  భయపడతారుఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుండా ఉంటాయి అంటూ కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఎన్కౌంటర్ తో దిశా ఆత్మ కు న్యాయం జరుగుతుంది అని పలువురు అభిప్రాయం పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: