ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం చేసినా సరే ప్రజల్లో మాత్రం వాటిపై మంచి అభిప్రాయమే ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి ఆరు నెల‌లు అవుతోంది. రాష్ట్ర౦లో ఇప్పుడు చాలా వరకు సంక్షేమ కార్యక్రమాల పండుగ జరుగుతోంది. విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలను జగన్ సర్కార్ అమలు చేస్తుంది. ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే వాటి అమలు విషయంలో జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదనే అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. జాతీయ స్థాయిలో కూడా అవి హైలెట్ అయ్యాయి.

 

ఇప్పుడు ప్రజలు వాటి గురించి ఏమని ఆలోచిస్తున్నారు...? దీని గురించి ఆసక్తి కర వ్యాఖ్యలే వినపడుతున్నాయి. ప్రజలు సంక్షేమ కార్యక్రమాలే కోరుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. దానికి కారణం కూడా చెప్తున్నారు. చంద్రబాబు హాయంలో అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్ము మొత్తం కూడా రోడ్లు పోయడానికి.. భవనాలు కట్టడానికి వెచ్చించారు. దీనితో ప్రజలకు ఇవ్వడానికి అరకొర సంపద మాత్రమే మిగిలింది. ఇక అభివృద్ధి కారణంగా కార్పోరేట్ శక్తులు భాగుపడ్డాయి గాని ప్రజలు కాదు అనేది అందరికి తెలిసిన విషయమే. బాబు మాట మాట్లాడితే పోల‌వ‌ర‌మో, అమ‌రావ‌తో అని గ్రాఫిక్స్ చూపించే వారే త‌ప్ప నిజ‌మైన సంక్షేమం లేదు.

 

కొన్ని వర్గాలకు లబ్ది చేకూర్చే ప్రయత్నాల్లో భాగంగా అప్పుడు చంద్రబాబు అభివృద్ధి అనే డ్రామాను మొదలుపెట్టారని, కాని జగన్ వచ్చిన తర్వాత పేదవాడి కడుపు నిండుతుంది అని ప్రజలు వ్యాఖ్యానించడం గమనార్హం. తమకు అభివృద్ధి వల్ల‌ ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు. పూటగడవనప్పుడు అభివృద్ధి మాకు ఏ విధంగా కూడు పెడుతుందని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు లేనప్పుడు ఇంకా అభివృద్ధి ఉన్నా ఉపయోగం లేదని ఇప్పుడు జగన్ తమను అర్ధం చేసుకునే ఈ స్థాయిలో వాటిని అమలు చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: