బోర్డర్ లో ఉండే సైనికులు ప్రతి క్షణం అలర్ట్ గా ఉంటేనే దేశంలో అన్ని సవ్యంగా ఉంటాయి.  ప్రతి ఒక్కరు గుండెలపై చేయి వేసి నిద్రపోవాలి అంటే అక్కడ సైనికులు తమ గుండెలను అడ్డుపెట్టి పహారా కాయాలి.  అప్పుడే దేశం చల్లగా ఉంటుంది.  ఎలాంటి అలజడులు లేకుండా పనులు చేసుకోగలుగుతుంది.  బోర్డర్ లో ఉండే సైనికులకు ప్రతి క్షణం ప్రాణ సంకటమే.  ఎప్పుడు ఎటువైపు నుంచి బుల్లెట్లు దూసుకొస్తాయో తెలియదు.  ఎప్పుడు అడ్డుగా పెట్టిన గుండెల్లో నుంచి దూసుకెళ్తాయో తెలియదు.  


అన్నింటికీ తెగించి నిలబడాలి...  దేశంలో తమ కుటుంబం గురించి ఆలోచించరూ.  దేశంలోని అన్ని కుటుంబాలు మనమే అనుకుంటారు.  అందుకే వారిని కాపాడాల్సిన బాధ్యతను తీసుకుంటారు.  బాధ్యతతో అడుగులు ముందుకు వేస్తారు.  ఎందుకో తెలుసా... తాము పోయినా తమను ఆదుకోవడానికి కోట్ల కుటుంబాలు ఉన్నాయనే ఒక నిబ్బరంతో.. తాము పోయినా తమను ఆదుకోవడానికి కోట్లాది మంది భారతీయులు ఉన్నారనే ఒక భరోసాతో... అందుకే తమ గురించి పెద్దగా ఆలోచించరు.  


అనుక్షణం దేశ రక్షణలో పోరాటం చేసిన చాలామంది వీరులయ్యారు.  శరీరంలోని భాగాలను కోల్పోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిన వ్యక్తులు కోకొల్లలు.  వారందరిని కేంద్రం ఆడుకుంటోంది.  వారికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి అవసరాలు తీరుస్తుంది.  అయితే, ఇందులో దేశంలోని 130 కోట్ల మందిని కూడా ఇన్వాల్వ్ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది.  అందుకే ప్రజలు ఇలాంటి విషయాల్లో స్పందించాలని కేంద్రం కోరుతున్నది. 


రేపు ఆర్మీ ఫ్లాగ్ డే.  ఈ సందర్భంగా  ఆర్మీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్లకు సహాయం అందించాలని ప్రజలను మోడీ కోరారు.  ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్రీయ సైనిక్ బోర్డు నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  ఈ మొత్తాన్ని డిడి రూపంలో మోడీకేంద్రీయ సైనిక బోర్డుకు ఢిల్లీలో అందజేస్తున్నారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మోడీకి కృతజ్ఞతలు తెలిపాడు.  బాధ్యతలను గుర్తు చేశారని ఆర్మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: