తెలంగాణా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో తనకు ఉన్న బలాన్ని వాడుకుని కెసిఆర్ సర్కార్ ని గద్దె దించే ఆలోచన బిజెపి చేస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి సన్నిహితంగా ఉండే... మేఘా కృష్ణా రెడ్డిపై ఐటి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఏం దొరికిందో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాజకీయంగా కూడా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అధికార పార్టీ నేత‌ల‌ను కంగారు పెట్టింది అనేది వాస్తవం.

 

ఇప్పుడు ఒక వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది. కెసిఆర్ కి ఎన్నికల సమయంలో మేఘా కృష్ణా రెడ్డి ఆర్ధిక సహాయం చేసారని... అది కూడా వేల కోట్ల రూపాయలు ఆయనకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మేఘా కృష్ణారెడ్డి సర్దారు అన్న‌దే ఈ ప్ర‌చారం. దీనిలో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది పక్కన పెడితే... ఇటీవల సిని పరిశ్రమ మీద కూడా ఐటి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎక్కువగా కేటిఆర్ కి సన్నిహితంగా ఉండే వారి మీదే జరిగాయి. ఇక ఇప్పుడు మేఘా దెబ్బ త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కి తగిలే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

 

కెసిఆర్ సన్నిహితులు అయిన ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ ఎంపీ మీద ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని, కొన్ని జీవోల్లో వారి పాత్ర ఉందని, మేఘా వద్ద దొరికిన కొన్ని ఆధారాల్లో వారి పేర్లు ఉన్నాయని వారిని విచారించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఎదోకరకంగా కెసిఆర్ ని ఇబ్బంది పెట్టాలి అని బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే రాజ్యసభ ఎంపీని ఐటి అధికారులు విచారిస్తారని అది కూడా మేఘా పత్రాల మీదే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక తెలుగుదేశం నుంచి వెళ్లి అక్కడ మంత్రి అయిన ఒక కీలక నేతపై కూడా ఐటి దాడులు జరుగుతాయని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: