మానభంగానికి మరణమే శరణమా అనే ఆలోచన ఇప్పుడు ప్రతివారిలో కలుగుతుంది. ఒక వైపు దిశ ఎన్‌కౌంటర్ ఘటనతో రాష్ట్రమంతా ఆనందోత్సవాలను జరుపుకుంటుంటే కొందరిలో మాత్రం ఎన్నో ఇలాంటి ఆలోచనలు ఆగకుండా పరిగెత్తు తున్నాయి. కాని సమస్యను ఇలాగే వదిలేస్తే కామాంధులు మరింతగా చెలరేగే అవకాశముందనే భయం కూడా వెన్నాడుతుంది. అలాగని ఎన్‌కౌంటర్ చేయడంతో సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరికినట్లు కాదు.

 

 

ఇకముందు కూడా ఇలాంటి ఘటనలు జరుగవన్న గ్యారంటీ ఏం లేదు. ఒకతల్లి తన కొడుకుతో, ఒక తండ్రి తన పిల్లలతో విద్య బుద్ధులతో పాటుగా సంస్కారాన్ని నేర్పించాలి. ఇలా జరుగని పక్షంలో ఇక పిల్లలు కన్నా ఉపయోగముండదు. ఇకపోతే హత్యాచారాలను చేసిన వారిని చంపుకుంటు వెళ్లితే ప్రపంచమే శ్మశానం అవుతుంది. ఎందుకంటే పేరు ప్రతిష్టలు, అధికారం ఉన్నవారు ఎన్ని తప్పులు చేసిన వారిని మాత్రం చిన్న చిన్న శిక్షలతో సరి పెడతారు. కాని న్యాయం అనేది అందరికి సమానంగా జరిగినప్పుడే న్యాయదేవతకు గౌరవం ఉంటుంది. కాని చట్టం అధికారం ఉన్నవారికి చుట్టంలా మారితే మాత్రం ఇప్పుడు చేసిన పనికి అర్ధం ఉండదు.

 

 

ఇకపోతే వెనకటి కాలంలో ఆడవారి కట్టుబొట్లు ఎంత పద్దతిగా ఉండేవంటే వారిని చూడగానే మాతృభావన మనసులో కలిగేది. కాని ఇప్పుడు పిల్లలను పెంచుతున్న తీరు కచ్చితంగా భావితరాలకు గొడ్డలి పెట్టులా మారుతుందని మారుతుందని చెప్పకనే తెలుస్తుంది. ఇక మనసులో కలిగే ఆలోచనలను జయించడం నేర్చుకుంటే లేదా అలవాటుపడటం నేర్చుకుంటే సమాజంలో కలిగే చెడును కొంతవరకు ఐనా రూపుమాపవచ్చూ. మనిషి ఋషికావాలంటే గొంగళి పురుగును ఉదాహరణగా తీసుకోవచ్చ్ను. ఒక గొంగళి పురుగును చూస్తే అసహ్యమేస్తుంది. కాని అదే సీతకోక చిలుకలా మారితే మాత్రం అందరు దాని వెంటే పడతారు.

 

 

దాని జన్మ అసహ్యంతో మొదలై ఆకర్షణతో ముగుస్తుంది. పచ్చకామెర్లు ఉన్న వారికి లోకం మొత్తం పచ్చగానే కనిపిస్తుందంటారు. అలాగే మనసు నిండా నీచపు ఆలోచనలు పెట్టుకున్న వానికి తల్లిని చూసిన మగ బుద్ధి ఊరుకోదు. ఇప్పుడు ఇలా సమాజం అసహ్యహించుకునే కొన్ని కొన్ని ఘటనలు అక్కడక్కడ అప్పుడప్పుడు మనం వివే ఉంటున్నాం.రాను రాను మానవతా విలువలు చచ్చిపోయి. మనుషులు మృగాలుగా మారుతున్నారు అందుకని మనుషులను చంపితే సమస్య చావదు. ముందు వారి ఆలోచనలు చంపాలని ఇప్పటికే మానసిక నిపుణులు చెప్పారు. అందుకే చావులతో సమస్యను ముగించే బదులు సామరస్యంగా పరిస్దితులను అనుకూలంగా మార్చి "మాను"షులను  మనుషులుగా మారుద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: