తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న దిశ అత్యాచారం, హత్య ఘటనకు ఈ రోజు ఓ ముగింపు పలికారు తెలంగాణ పోలీసులు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నింధితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లు తిరగబడటంతో ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ సంఘటనపై యావత్‌ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా ఈ ఘటనపై నటి, నిర్మాత మంచు లక్ష్మీ స్పందించారు. లక్ష్మి మాట్లాడుతూ...దిశకు జరిగిన అన్యాయం తెలిసినప్పటి నుండి నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఈ రోజు ఎన్ కౌంటర్ వార్త వినగానే ఒక మహిళగా, తల్లిగా చాలా సంతోషించాను. కానీ ఈ ఎన్‌కౌంటర్ నిజమైన పరిష్కారమా..? అంటే మాత్రం చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఈ ఘటన లాగా అన్ని సంఘటనలు చూడలేము. ఇలాంటి పరిస్థితి అన్ని సందర్భాలలోనూ రావాలి.

 

ఇకపోతే ఇలాంటి ఘటనే వరంగల్ లో జరిగింది... కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న ముగ్గురు అమ్మాయిల పై ఓ యువకుడు చేసిన యాసిడ్ దాడి మరువక ముందే ఈ ఘటన చోటచేసుకుంది.. స్వప్నిక, ప్రణీత లు కాలేజి నుండి ఇంటికి వెళుతుండగా ముగ్గురు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో స్వప్నిక ప్రాణాలతో పోరాడి ఓడిపోగా. కాలిన గాయాలతో ప్రణీత భయపటడింది. దాంతో దిశ ఘటనలో ఎలాగైతే ఎన్‌కౌంటర్ జరిగిందో అలాగే అప్పుడు కూడా ఎన్‌కౌంటర్ జరిగింది. నిందితులు అంతా మరణించారు.

 

శ కేసులో నిదితుల ఎన్ కౌంటర్ పై ప్రణీత స్పందించింది.. ఈ విషయం పై మాట్లాడుతూ..కానీ ఇంకా అలాంటి దాడులు, అఘాయిత్యాలు జరగటం లేదా.? న్యాయం జరగాల్సింది ఎన్‌కౌంటర్‌ ద్వారా కాదు, అలాంటి దాడులు జరగకుండా నిరోధించే చట్టాలు, వాటి అమలుతోనే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కఠిన చట్టాలను అమలు చేస్తేనే కానీ ఈ దాడులు అగవని ప్రణీత అన్నారు.. మగవారిని అక్కడిక్కడి కే చంపేస్తే ఇంకో అమ్మాయి జోలికి వెళ్లాలంటే జంకు తారని ఓ మీడియా ఛానెల్ సందర్భంగా వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: