దిశ హత్యాచారం.. అతికిరాతకంగా ఒక వెటర్నరీ వైద్యురాలు దిశను అన్యాయంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమె శరీరంపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఆమెను అతికిరాతకంగా చంపింది వారే అని ఘటనలో నిందితులు నిజం ఒప్పుకోగా ఆ నిందితులను రిమాండ్ లో ఉంచారు. 

 

అయితే నిన్న అర్ధరాత్రి అదే ఘటన స్థలంలో ఆ ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. వారిపై రాళ్లతో, కర్రలతో కొట్టారు.. గన్ తీసుకొని బెదిరించార.. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులును తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిందితులు నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

 

ఈ నేపథ్యంలోనే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న ప్రణీత, స్వప్నికలపై ముగ్గురు నీచులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది. అయితే ఈ యాసిడ్ దాడితో తీవ్ర గాయాలపాలైన స్వప్నికా మృతిచెందగా. ఆ నిందితులను పోలీసులు నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చేసి కాల్చి చంపేశారు. 

 

అయితే అప్పట్లో ఈ ఘటన అత్యాచారం చేసే వారిని యాసిడ్ దాడి చేసే వారికి ఆడపిల్లలపై దాడి చేసే వారికీ చుక్కలు కనిపించాయి. భయం పుట్టించింది ఈ ఘటన. ఈ నేపథ్యంలోనే ఆ దాడిలో స్వప్నికా స్నేహితురాలైన ప్రణీత కాలిన గాయాలతో ప్రాణాలతో భయపటడింది. 

 

అయితే. ఈ దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రణీత మాట్లాడుతూ.. సత్వర న్యాయం అయితే జరిగింది. కానీ ఇంకా అలాంటి దాడులు, అఘాయిత్యాలు జరగటం లేదా.? న్యాయం జరగాల్సింది ఎన్‌కౌంటర్‌ ద్వారా కాదు, అలాంటి దాడులు జరగకుండా నిరోధించే చట్టాలు, వాటి అమలుతోనే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

 

ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె కఠిన చట్టాల కోసం డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే నిందితుల కోసం కఠిన చట్టాలు తీసుకువచ్చే రోజులు వచ్చేశాయని ఆ కఠిన చట్టాలు తీసుకువస్తేనే ప్రజలలో అంతో ఇంతో మార్పు వస్తుంది అని ఆమె అభిప్రాయ పడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: