తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ బాగా పనిచేసింది. డిమాండ్స్ పరిస్కారం కాకపోతే విధులలోకి రాము అని సమ్మె చేసారు. ఆ టైములో ఒక పది మంది కార్మికులు చనిపోయారు. వాల్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తర్వాత చర్చలు విఫలం అయ్యి కార్మికులు రాజి కి వచ్చారు.



 కొంత కాలంగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగిన విషయం తెలిసిందే. తమ డిమాండ్స్ పరిష్కరించాలని సమ్మె చేసి పది మంది కార్మికులు చనిపోయారు. కుటుంబానికి అండగా ఉండి, ఉపాధి నిచ్చే పెద్ద దిక్కుని కోల్పోయాక ఎలా బతకాలి అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.


"చనిపోయిన కుటుంబాలు మా కుటుంబాలే, వాళ్ళు మా బిడ్డలే, వాళ్ళని ఆదుకుంటాం అవసరాలు తీర్చి, కడుపులో పెట్టుకుంటాం, కుటుంబములో ఒకరికి ఉద్యోగం ఇస్తాము"అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో హామీ ఇచ్చారు.. పరిస్థితులని బట్టి ప్రభుత్వ ఉద్యోగం గాని లేకపోతే ఆర్టీసీ లో గాని తప్పకుండా ఉద్యోగం ఇస్తాము అని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సిఎం గారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తాము . వాళ్ళకి రక్షణ గా ఉంటాము, వాల్ల కుటుంబాలని ఆదుకుంటాము  అని మాట ఇచ్చారు.. ఆ మాటనే ఇపుడు నిలబెట్టుకున్నారు. 10 కుటుంబాలలో ఎవరెవరికి ఎయె అర్హత ఉందో చూసి వారికీ ఉద్యోగాలు ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ గా నలుగురుకి, కానిస్టేబుల్ గా ఐదు  గురికి, కండక్టర్ గా ఒకరికి కొలువులు కేటాయించారు. మొత్తం  మీద పది ఉద్యోగాలు కేటాయించారు. 


అనుకున్న విధంగానే కెసిఆర్ గారు మాట నిలబెట్టుకున్నారని, మా జీవితాల్లో వెలుగులు నింపారని బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి. తమ కుటుంబలో వ్యక్తిని పోగొట్టుకుని మేము విలపిస్తుంటే కెసిఆర్ సార్ మాకు అండ గా ఉన్నారు అని ఆనందం వ్యక్తం చేశారు. ఇంటికి పెద్ద కొడుకులా ఆదరిస్తాము అని అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: