ప్రపంచంలో నేరాలు  ఘోరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది.  తేలకుండా ఇంకా పోలీస్ స్టేషన్ కోర్టుల్లో ఉన్న కేసులు కోకొల్లలు.  ఎన్నో రకాల కేసులు తేలకుండా అలానే ఉండిపోతున్నాయి.  ఇలా తేలకుండా ఇండిపోయిన కేసులను విచారించి వదిలేస్తున్నారు.  అలాంటి వ్యక్తులు నేరాలు చేసి జైలునుంచి బెయిల్ పై తిరిగి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.  వీరికి తగిన చెప్పాలని కోర్టులు చట్టాలు మార్చాలని  నినాదాలు చేస్తున్నా ఉపయోగం ఉండటం లేదు.  


ఎందుకంటే, ఎన్నో కేసులు తేలకుండా ఇలానే ఉండిపోతున్నాయి.  ఎన్నో కేసులు తేలకుండా మరుగునపడిపోతున్నాయి.  ఎన్నో కేసులు అలా ఎవరూ పట్టించుకోవడం లేదు.  ఎన్నో కేసులు విచారించి మనకు ఎందుకులే అని వదిలేస్తున్నారు.  ఇలా కేసులను పట్టించుకోకుండా వదిలేయడంతోనే నేరాలు చేసే వాళ్లకు చేయాలి అనుకునే వాళ్లకు ఎలాంటి భయం లేకుండా పోతున్నది.  మృగాళ్లను కూడా ఒక మృగంలా ట్రీట్ చేయాలని, మహిళలపై అత్యాచారాల వంటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులకు జంతువుల మాదిరిగానే క్యాస్ట్రేషన్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు తెరమీదకు వస్తున్నది.  


ఒక మనిషిని చంపడం మన పనికాదు.  చట్టం కూడా ఆ పనిని చేయలేకపోతున్నది.  తప్పు చేసిన వ్యక్తులకు తప్పకుండ శిక్షలు వేయాలి.  కానీ, ఆ శిక్షలు కఠినంగా ఉండాలి.  అలా శిక్షలు కఠినంగా ఉండాలి అంటే తప్పకుండా నేరాలను అరికట్టాలి.  అది జరగడం లేదు.  ఎంత పగడ్బందీగా పోలీసులు ప్లాన్ చేసి అన్నింటిని రక్షిస్తున్నా... ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరం జరుగుతూనే ఉన్నది.  ఘోరం జరుగుతూనే ఉన్నది.  


అందుకే నేరాలు, ఘోరాలను అరికట్టేందుకు రెండే మార్గాలు ఉన్నాయి.  ఒకటి తప్పు చేసిన వ్యక్తిని దిశ కేసులో ఎన్ కౌంటర్ చేసినట్టుగానే చేయడం లేదంటే, క్యాస్ట్రేషన్ చేయడం.  క్యాస్ట్రేషన్ చేయడం వలన వాడు మరలా తప్పు చేయలేడు.  అలాంటి ఆలోచన కూడా వాడికి రాదు.  అయితే, ఇక్కడ ఇంకొక ఇబ్బంది కూడా వచ్చేలా ఉన్నది.  క్యాస్ట్రేషన్ చేయడం వలన వాడు సమాజంపై పగను పెంచుకొని మరో కోణంలో దారుణాలకు పాల్పడ వచ్చు కదా.  ఈ నేరాలను అరికట్టాలి అంటే ఏం చేయాలి.. మేధావుల బుర్రలకు  నేరస్తులు బాగా పనిపెట్టారే... 

మరింత సమాచారం తెలుసుకోండి: