దేశంలో ప్రజలు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు.  ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తూ దానికి అనుగుణంగా పని చేస్తున్నారు.  ఈజీగా డబ్బు చేతికి వస్తుంటే ఎవరు మాత్రం ఎందుకు కాదంటారు చెప్పండి.  అందుకే చాలామంది ఇలాంటి మార్గాలను ఎంచుకొని ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది... ఎలా వస్తుంది అంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.  అందులో ఇకటి గ్యాబ్లింగ్, రెండోది దొంగతనం..ఇటీవల కాలంలో చాలామంది ఇటువైపు మళ్లుతున్నారు. 


దొంగతనాన్ని వృత్తిగా చేసుకుంటున్నారు.. దొంగతనాలకు పాల్పడుతూ... జీవితాన్ని కొనసాగించే వ్యక్తులు దేశంలో కోకొల్లలు.  వారి వృత్తి దొంగతనం చేయడం.. అదే పనిలో ఉంటారు.  మధ్యప్రదేశ్ లో దొంగతనాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది.  ఇదిలా ఉంటె ఓ దొంగ ఓ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాడు.  దొంగతనం చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి వెళ్లే సమయంలో ఓ లెటర్ రాసి టేబుల్ పై పెట్టి వెళ్ళాడట. ఇప్పుడు ఆ లెటర్ వైరల్ గా మారింది.  


ఇంతకీ ఆ లెటర్ ఏంటి.. అందులో ఏమున్నది తెలుసుకుందాం.  అనగనగా ఓ ఇల్లు.. ఆ ఇంట్లోకి ఓ దొంగ దొంగతనం చేయడానికి వచ్చాడు.  ఆలా వచ్చిన వ్యక్తి ఇంట్లోని అన్ని రూములు గాలించాడు.  ఆ ఇంట్లో ఎక్కడా కూడా తనకు కావాల్సిన విలువైన వస్తువులు ఒక్కటి కూడా దొరకలేదు.. పాపం రాత్రి మొత్తం ఇల్లంతా గాలించడమే సరిపోయింది.  దీంతో విసిగిపోయిన ఆ దొంగ వెళ్తూ వెళ్తూ తన కోపాన్ని అక్షరాల రూపంలో మార్చి లెటర్ రాశాడు.  


ప్రియమైన ఇంటి యజమాని గారికి.. మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తే నాకు ఒక్క వస్తువు కూడా దొరకలేదు.. మీరు ఇంట పిసినారి అనుకోలేదు.  కనీసం నా శ్రమకు ఫలితంగా కూలి దొరకలేదు.  మీ ఇంటి కిటికీ ఓపెన్ చేసినందుకు పడిన కష్టానికైనా ఈ ఇంట్లో నాకు ప్రతిఫలం లభించలేదు... అని చెప్పి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు.  మరుసటి రోజున ఇంటికి పనిచేయడానికి ఆ ఇంటికి వచ్చిన పనిమనిషి ఇంట్లో వస్తువులు చల్లాచెదరుగా పడి ఉండటం చూసి షాక్ అయ్యింది.  వెంటనే కంప్లైన్ట్ ఇచ్చింది.  బయట ఉండే సిసి టీవీల ఆధారంగా దొంగను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.  ఈ సంఘటన మద్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: