రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా తప్పుకున్న సంగతి తెలిసిందే.  2014 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, యూపీఏలో చాలా పార్టీలు దీనిని వ్యతిరేకించినా ఏమి చేయలేక కామ్ గా ఉన్నాయి.  రాహుల్ గాంధీ మరో రాజీవ్ గాంధీలా దేశంలో ప్రభుత్వాన్ని తీసుకొస్తారేమో అనుకున్నారు.  కానీ, అది జరిగేలా కనిపించడం లేదు.  ఎందుకంటే, రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.  కొన్ని రాష్ట్రల్లో విజయం సాధించింది అంటే అక్కడ బీజేపీపై వచ్చిన విమర్శలే కారణం అని చెప్పాలి.  


వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ తన చరిష్మాను పెంచుకోవాలి.  అలా చేస్తేనే రాహుల్ కు పెద్దగా దేశంలో చరిష్మా లేదు.  ఎలా మాట్లాడాలో పెద్దగా అవగాహన లేదు.  మోడీలా ఆకట్టుకునే నేర్పు, మాట్లాడే తీరు లేదు.  బహుశా ఇవే రాహుల్ ఓటమికి కారణాలు.  అంతెందుకు అమేథీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.  కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓటమిపాలయ్యాడు అంటే అర్ధం చేసుకోవచ్చు.  


కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న స్థానంలోనే ఓటమిపాలయ్యారు అంటే దేశంలో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురాగలుగుతారు.  అందుకే అయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  ఒకే ఇది బాగానే ఉన్నది.  కేరళలోని వయయనాడ్ నుంచి పోటీ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది.  ఇక ఇదిలా ఉంటె, ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ గా ఉంటున్నారు. 


త్వరలోనే తిరిగి రాహుల్ కు ఈ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.  కాగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీకే సపోర్ట్ చేస్తున్నది.  వచ్చే ఏడాది జరిగే ఏఐసిసి మీటింగ్ లో రాహుల్ కు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.  మరి రాహుల్ గాంధీ అందుకు సిద్ధంగా ఉన్నారా.. లేరా అన్ని తెలియాలి.  ఒకవేళ రాహుల్ గాంధీ సిద్ధంగా ఉంటె తిరిగి ఆయనకు పగ్గాలు అందివ్వడం పెద్ద విషయం కాదు.  మరి చూద్దాం ఎం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: