దిశ ఘటన.. గత పదిరోజులుగా ప్రతి ఒక్కరి మనసు కాల్చుకు తిన్న సంఘటన. వెటర్నరీ డాక్టర్ అయినా దిశను అతికిరాతకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి ఆమె శవాన్ని ఆమె తల్లిదండ్రులు తాకనుకూడా తాకకుండా పెట్రోల్ పోసి కాల్చేశారు. దీంతో దేశమంతా వారిని చంపేయాలని ఎన్నో నినాదాలు చేసింది. 

 

మాకు అప్పగించండి ఆ నీచుడిని అని పోలీసులపై చెప్పుల దాడి జరిగింది. అయితే ఆ కేసు నిందితులను మొన్న రాత్రి సీన్ కరెక్షన్ చేసేందుకు ఘటన స్థలానికి తీసుకెళ్లగా అక్కడ వాళ్ళు పోలీసులపై దాడి చేసేసరికి ఆత్మరక్షణ కోసం ఆ నిందితులను ఎన్కౌంటర్ చేసేశారు పోలీసులు. దీంతో ఈ ఎన్కౌంటర్ నిన్న అంత సంచలనం సృష్టించింది. 

Image result for unnao rape victim died

అయితే నిన్న ఘటాన ఇంకా మరవనే లేదు.. ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. చావుబతుకుల మధ్య పోరాడుతూన్నా ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు తన తుదిశ్వాస విడిచింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న శుక్రవారం రాత్రి 11.40 గంటలకు ప్రాణాలువిడిచినట్లు డాక్టర్లు తెలిపారు. 

 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నావ్‌కు చెందిన ఓ యువతి తనపై అత్యాచారం జరిపారని, మార్చిలో ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లేందుకు సదరు బాధితురాలు బయల్దేరింది. అయితే సరిగ్గా కోర్టుకు హాజరయ్యే సమయంలో ఆమెను ప్రధాన నిందితుడు దారిలో అడ్డు చెప్పి ఆమెపై హత్యాయత్నం చేశారు.

 

ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు దీంతో బాధితురాలు మంటలతో.. కేకలు వేస్తూ పరుగులు తీసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మంటలను ఆర్పివేసి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 90శాతంకి పైగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం యూపీ నుంచి ఢిల్లీకి తరలించారు. 

 

రెండు రోజులపాటు చికిత్స పొందిన తర్వాత బాధితురాలు తన తుది శ్వాస విడిచింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి అయిదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరి ఈ ఉన్నావ్ బాధితురాలుకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో... మన దేశం ఇక మారదా ? ఇంతేనా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: