దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులను తలచుకునేలా చేసింది. దిశ ఆత్మకు శాంతి చేకూరేలా ఆమెను ఎక్కడైతే సజీవ దహనం చేసారో అక్కడే నిందితులు కాల్చివేయబడ్డారు. సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌తో ముగిసింది.

 

ఇక ఎన్‌కౌంటర్‌ వెనుక సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కి ప్రధాన కారణం మహమ్మద్ అలియాస్ ఆరీఫ్ అని తెలుస్తోంది. మొదటి నుంచి ఆరీఫ్ ప్రవర్తన వివాదస్పదంగా ఉండేదని గ్రామస్థులు చెప్తున్నారు. ఒక వ్యక్తి ఆరీఫ్ కు సెల్ ఫోన్ ఇప్పించగా, కొన్ని రోజుల తరువాత డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ వ్యక్తి కోరగా ఆరీఫ్ మాత్రం డబ్బులు ససేమిరా ఇవ్వనంటూ గొడవ పెట్టుకుని ఆ వ్యక్తిని కొట్టినట్లు గ్రామస్థులు చెప్తున్నారు.

 

చర్లపల్లి జైలుకు తరలించిన మొదటి రోజు నుంచే ఆరీఫ్ ప్రవర్తనలో తేడాను పోలీసులు గమనించినట్లు సమాచారం. తోటి నిందితులను జైల్లోనే దూషించినట్లు తెలుస్తోంది. పోలీసులు హెచ్చరించినా బేఖాతరు చేసి మళ్ళీ తోటి నిందితులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు ఆరీఫ్, ఇక పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో సైలెంట్ అయిపోయాడు.

 

ఇక పోలీసులకు నిందితులను కస్టడీలోకి తీసుకున్న మొదటి రోజు మొత్తం స్టేషన్లో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలోనే తమ మీద బయట ఎంత వ్యతిరేకత ఉందో గమనించాడు ఆరీఫ్, ఎలాగైనా పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూసినట్లు తెలుస్తోంది. కస్టడీలో రెండు రోజున పోలీసులు నిందితులను తెల్లవారుజామున పకడ్బందీ బందోబస్తు మధ్య సీన్ రీ కంస్ట్రక్షన్ కోసం ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లారు. తెల్లవారుజాము కావడం, చీకటి ఉండడం, తెలిసిన ప్రాంతం కావడంతో తోటి నిందితుడు చెన్నకేశవులకు పారిపోదాం అని హింట్ ఇచ్చాడు. 

 

దీనితో ఇద్దరు నిందితులు పోలీసుల దగ్గరున్న పిస్తోళ్లను లాక్కున్నారు. మరో ఇద్దరు నిందితులు దగ్గర్లో ఉన్న రాళ్లు కర్రలతో దాడి చెయ్యడం ప్రారంభించారు. నిందితులను లొంగిపోవాల్సిందిగా పోలీసులు కోరినా లాభం లేకపోయింది, ఈ క్రమంలోనే నిందితుల దాడిలో ఒక ఎస్సై, కానిస్టేబుల్ గాయపడ్డారు. దీనితో ఆత్మరక్షణకు గానూ పోలీసులు కాల్పులు జరిపి నిందితులను చంపేశారు. ఈ  ఎన్‌కౌంటర్‌ వెనుక ఆరీఫ్ సూత్రధారిగా వ్యవహరించడంతో నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పొయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: