నెల్లూరు జిల్లాలోని అధికారపార్టీ ఎంఎల్ఏల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. నెల్లూరు నగరంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ నెల్లూర నగరం మాఫియా అడ్డాగా మారిపోయిందని చెప్పటం సంచలనంగా మారింది.

 

ఆనం చేసిన వ్యాఖ్యలు మంత్రి అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని ఉద్దేశించే చేసినవే అనే ప్రచారం పార్టీలో పెరిగిపోతోంది. ఎందుకంటే వాళ్ళకు  మొదటి నుండి పడదన్న విషయం అందరికీ తెలుసు. ఆనం టిడిపిలో నుండి వైసిపిలోకి మారటం జిల్లాలో చాలామంది నేతలకు ఇష్టం లేదు. అయితే పరిస్ధితుల ప్రభావం వల్ల ఆనంను చేర్చుకోవటానికి అందరూ ఒప్పుకున్నారు.

 

మంత్రి పదవిని ఆనం ఆశించినా దక్కలేదు. తనకన్నా బాగా జూనియర్ అయిన అనీల్ కు మంత్రిపదవి దక్కటాన్ని కూడా ఆనం జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వ్యాఖ్యలకు ఈ నేపధ్యమే ప్రధాన కారణమనే నేతలు అనుమానిస్తున్నారు. మాఫియా ముఠాల ఆగడాలను నియంత్రించే వ్యవస్ధే లేదని ఆనం బోల్డు బాధపడిపోయారు. ఏ రకమైన మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్ళాలని జనాలు అనుకుంటున్నట్లు చెప్పారు.

 

ఏ ఒక్క అధికారిని కూడా ప్రజాప్రతినిధులు పనిచేసుకోనీయటం లేదని మండిపడ్డారు. ఇక్కడ ప్రజాప్రతినిధులంటే మొత్తం వైసిపి వాళ్ళే అని అర్ధమైపోతోంది. ఎందుకంటే టిడిపి నుండి ఒక్క ఎంఎల్ఏ కూడా గెలవలేదు. నెల్లూరు నగరంలో కబ్జా రాయళ్ళు, లిక్కర మాఫియా, బెట్టింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా ఇలా అన్ని మాఫియాలకు నెల్లూరే కేంద్రంగా మారిపోయిందని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

అసలు నగరాన్నే గ్యాంగ్ స్టర్స్ కు అప్పగించేసినట్లు ఆనం వ్యాఖ్యలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. నలుగురు ఎస్పీలు మారారంటేనే పరిస్ధితి అర్ధమవుతోందన్నారు. తమ ప్రజాప్రతినిధులు అధికారులను పనిచేయనీయటం లేదని ఆరోపించటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా పరిస్ధితి ఈ విధంగా ఉంటే నేరుగా సిఎంను కలిసి చెప్పకుండా మీడియాలో మాట్లాడటమే విచిత్రంగా ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: