హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవాలని చూశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిపై కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు స్పాట్‌లోనే చనిపోయారు. ఇక మొత్తం 10 మంది పోలీసులు ఈ ఘటన జరిగిన సమయంలో ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సీరియస్‌గా గాయపడ్డారు. గాయపడ్డ పోలీసులు ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌కుమార్ కేర్ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. దిశ హత్యాచారం జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీట‌ర్ దూరంలో ఈ ఇన్సిడెంట్ జ‌రిగింది. ఇదంతా ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన‌వే. 

 

వాస్త‌వానికి కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. అలాగే దిశ కేసులో నిందుల‌ను ఎందుకు ఎన్‌కౌంట‌ర్ చేయాల్సి వ‌చ్చింది? ఇదంతా ఎలా జ‌రిగింది? అన్న వివ‌రాలు ఇప్ప‌టికే సీపీ సజ్జనార్ విరించారు. అయితే దిశ హత్యాచార కేసులో నిందితులను అసలు ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందన్న విషయంలో మరో కోణం బయటికొచ్చింది. నిందుతుల ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌క‌పోయుంటే శిక్ష ప‌డ‌డం చాలా క‌ష్టమ‌ని నిపుణులు అభిప్రాయ‌పడుతున్నారు. ఎందుకంటే  ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, సంఘటనలో బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఇది కోర్టులో నిలబడడం కష్టంగా మారేది.

 

అదే విధంగా..  తామే నేరం చేశామన్న నిందితుల వాంగ్మూలానికి చట్టం ముందు విలువుండదు. పోలీసులు చంపుతామని బెదిరించడంతో తామలా వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెబుతారు నిందితులు. మ‌రియు నిందితులే నేరం చేశారనేందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఏవీ లేవు. వాస్త‌వానికి అత్యాచారం జరిగినట్లు నిరూపించాలంటే ముందు నిందితులకు వైద్యపరీక్షలు చేయాలి. వారి దుస్తులు సేకరించాలి. వాటిపై వీర్యం, రక్తం మరకలు ఫోరెన్సిక్‌ లేబోరేటరీకి పంపి నిర్థారించాలి. కానీ పోలీసులు ఇక్కడ ఆ ఆధారాలు సేకరించినట్లు కన్పించడంలేదు. అలాగే దిశ శరీరం పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో డీఎన్‌ఏ పరీక్షతో సరిపోల్చడం కూడా సాధ్యం కాదు. అందుకే ఈ కేసులో ఆధారాలు బ‌ల‌హీనంగా ఉండ‌డంతో నిందితుల‌కు శిక్ష ప‌డ‌డం క‌ష్ట‌మ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: