కొద్దిరోజుల క్రితం మన దేశవ్యాపతంగా తీవ్ర కలకలం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను నిన్న ఉదయం పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసు రి కన్స్ట్రక్షన్ సందర్భంగా నిందితులను ప్రియాంకను కాల్చిన చోటికి తీసుకువెళ్లిన సమయంలో వారి నుండి గన్స్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించడంతో పాటు, తమ పై రాళ్ల దాడి చేయడంతో పొలిసు వెంటనే కాల్పులు జరిపారు. కాగా ఆ కాల్పుల్లో నలుగురు నిందితులు కూడా అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. 

 

ఇక ఆ నలుగురు నీచుల మరణంతో దేశవ్యాప్తంగా ప్రజలు మరియు పలు సంఘాల వారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఒక అమాయకమైన అమ్మాయిని ఎంతో కిరాతకంగా హింసించి రేప్ చేసి, ఆ తరువాత మర్డర్ చేసిన ఆ నీచులకు అదే సరైన శిక్ష అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక నిందితుల ఎన్కౌంటర్ పై మానవ హక్కుల కమీషన్ నుండి మాత్రం కొంత వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నిందితులు ఎంత పెద్ద ఘోరాన్ని చేసారు అనే విషయాన్ని ప్రక్కన పెడితే, వారిని కొద్దిగా కూడా మానవీయ కోణంలో ఆలోచించకుండా, 

 

ఈ విధంగా ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు సబబనే వాదన వారి నుండి వినపడుతోంది. ఇక నేడు జాతీయ మానవ హక్కుల వేదిక సభ్యులు మహబూబ్ నగర్ చేరుకొని ఆ నలుగురు నిందితుల మృతదేహాలను మరొక్కమారు రి పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు తమ కొడుకుల మృతదేహాలను తమకు అప్పగించాలని నిందితుల తల్లితండ్రులు వారి స్వగ్రామమైన గుడిగండ్ల వద్ద రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మానవ హక్కుల వేదిక ప్రతినిధులు మహబూబ్ నగర్ వస్తుండడంతో అక్కడ ఎటువంటి ఘటనలు జరుగకండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కాగా ఇటువంటి నీచుల పట్ల మానవీయ కోణం లో ఆలోచించవలసిన అవసరం లేదని, అంత ఘోరమైన తప్పులు చేసారు కాబట్టే వారి చావుకూడా అంత ఘోరంగా ఉందని పలువురు ప్రజలు వారిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: