తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ మీద సుప్రీం కోర్టులో రెండు పిల్స్ దాఖలు అయ్యాయి. ప్రదీప్ కుమార్ యాదవ్, జీ ఎస్ మణి ఈ పిటిషన్లను దాఖలు చేశారు. సుప్రీం కోర్టు 2014 సంవత్సరంలో ఎన్ కౌంటర్ల గురించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ను పోలీసులు ఫాలో కాలేదనే అభియోగంతో పిల్స్ దాఖలయ్యాయి. ఎన్ కౌంటర్ మీద దర్యాప్తు జరిపి ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
సోమవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్​హెచ్​ఆర్​సీ బృందం ఢిల్లీ నుండి బయలుదేరింది. శంషాబాద్ కు కొద్దిసేపటి క్రితం ఎన్​హెచ్​ఆర్​సీ బృందం చేరుకుంది. శంషాబాద్ నుండి ఎన్​హెచ్​ఆర్​సీ బృందం చటాన్ పల్లికి వెళ్లనుంది. అక్కడినుండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి ఎన్​హెచ్​ఆర్​సీ బృందం ఎన్​హెచ్​ఆర్​సీ కి నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ఎన్​హెచ్​ఆర్​సీ చర్యలు తీసుకోనుంది. 
 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు దిశ ఫోన్ కాల్ ఆధారంగా మరియు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కనిపెట్టారని సమాచారం. దిశ హత్య కేసులో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని లోతుగా పరిశీలించగా కొంతమంది వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. పోలీసులు లారీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా లారీ డ్రైవర్ అరీఫ్, క్లీనర్ శివ వివరాలు తెలిశాయి. 
 
పోలీసులు అరీఫ్, శివలను విచారించగా నవీన్, చెన్నకేశవులు గురించి పోలీసులకు తెలిసిందని సమాచారం. మృతుల కుటుంబ సభ్యులు పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ గుడిగండ్ల ప్రధాన రహదారి దగ్గర ధర్నాకు దిగారు. నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య పోలీసులు ఇలా నా భర్తను ఎన్ కౌంటర్ చేసి చంపడం న్యాయమా అని ప్రశ్నించింది. సాంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరిపేలా చేస్తామని పోలీసులు భరోసానివ్వడంతో శాంతించి చెన్నకేశవులు కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: