తెలంగాణ హైకోర్టు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై  కీలక ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షాద్‌నగర్ చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టింది. దీనిపై హైకోర్టు డిసెంబర్ 9 వరకు  ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ కేసు నిందితులు ఆరిఫ్‌, నవీన్‌, చెన్నకేశవులు, శివ మృతదేహాలను భద్రపరచాలని  ఆదేశించింది.కేసు విచారణను  ఆ రోజు ఉదయం 10:30 గంటలకు  చేపడతామని న్యాయస్థానం వెల్లడించింది.

 

ఈ  విచారణకు అస్సలు  కారణం ఏమిటంటే హైకోర్టు నిన్న తెల్లవారు జామున జరిగిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై  ఉత్తర్వులు జారీ జేసింది.శుక్రవారం సాయంత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ మహిళా హక్కు లు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 

ప్రస్తుతం ఈ  ఫిర్యాదు ఒక సంచలనంగా  మారింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ సెలవులో ఉన్నందున సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు  ఆ ఫిర్యాదును పరిశీలించి, సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి ఈ కేసును విచారణకు స్వీకరించారు. ఆయన నివాసంలో ధర్మాసనం సమావేశమై విచారణ జరిపింది. ఈ విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరయ్యారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో ఆ నలుగురి నిందుతుల మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని, వీడియో చిత్రీకరించినట్టు ఏజీ చెప్పారు. మృత దేహాలను పోస్టు మార్టం చేసే సమయంలో తీసిన వీడియోను భద్ర పరచాలని,మహబూబ్ నగర్ జిల్లా జడ్జికి  ఆ వీడియో, సీడీ, పెన్ డ్రైవ్ లను  ఇవ్వాలని ఆదేశించారు.  ప్రతి ఒక్క అధికారులందరికీ దీనికి సంబంధించిన ఉత్తర్వులను  ఇవ్వాలని ఏజీకీ సూచించారు. ఈ పిటిషన్ తదుపరి విచారణ కోసం 9 న ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తామని, ఆ ఆధారాలను విచారణలో ఉంచాలని ఆదేశించారు. అనంతరం  ఆ నలుగురి నిందుతుల  మృతదేహాలను ఈ నెల 9 వ తేదీ రాత్రి 8 గంటల వరకూ భద్రపర్చాలని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: