శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాల సొమ్ము.. మక్కా, జెరూసలేం వెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఏమన్నారంటే.. ఒకప్పుడు దేవాలయాలు, సత్రాలు, చావళ్లు ఎంతో సేవ చేసాయి..
దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం మక్కా, జెరూసలేం కి వెళ్తోంది.. గురుకులాలు రాజకీయాలకు నిలయాలుగా మారాయి అన్నారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ స్వచ్చంద సేవా సంస్థల ముసుగులో జరుగుతున్న మోసాన్ని మోదీ ప్రభుత్వం సంస్కరిస్తోంది.. కొన్ని కార్పొరేట్ సంస్థలు సేవ పేరుతో సొంత ప్రచారం చేసుకుంటున్నాయి.. ప్రతి ఒక్కరు సమాజానికి సేవ చేయాలి.. తెలుగు రాష్ట్రాలలో సేవ చేయడానికి చాలా అవకాశం ఉంది అన్నారు.

 

" నదుల సంగమం, నదులు సముద్రాల్లో కలిసే సంగమాలు సుపరిచితమే.. సేవా సంగమం చాలా అరుదుగా కనిపిస్తోంది.. సజ్జనులు, మంచివాళ్ళు మాట్లాడాలి అప్పుడే దుర్జనులు మౌనం వహిస్తారు.. దిశ హత్య కేసులో నిందితులను అంతమొందించడం ప్రజల తీర్పు
అది పోలీసులు, ప్రభుత్వాలు ఇచ్చిన తీర్పు కాదు... ప్రజలు రోడ్డు మీదకు వచ్చినప్పుడే చట్టం తన పని తాను చేస్తుంది అన్నారు స్వామి పరిపూర్ణానంద.

 

సొంత ప్రయోజనం లేకుండా సేవ చేయడం అభినందనీయం.. ప్రతి వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా వ్యవహరించాలి.. తన కుటుంబాన్ని తల్లిదండ్రులు, భార్యాపిల్లలను గౌరవించి, ఆదరించాలి.. ఆ బాధ్యతలు వహించనప్పుడే సేవా సంఘాల అవసరం వస్తుంది.. అన్నారు స్వామి పరిపూర్ణానంద.

 

మరింత సమాచారం తెలుసుకోండి: