నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్ ’ మూవీ తర్వాత ‘జనసేన’ పార్టీ స్థాపించారు.  ఈ పార్టీ స్థాపించి ఆరేళ్లు అవుతుంది.  అయితే పార్టీ స్థాపించిన కొత్తలో ఎన్నికల్లో పోటీ చేయలేదు.  టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చారు.  అయితే రాష్ట్ర రాజధాని ఇతర అంశాలపై ప్రస్తావిస్తూ ఐదేళ్లు గడిపారు.  ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేశారు.  ఈ సందర్భంగా మూడు నెలల అవిశ్రాంతంగా ప్రచారం చేసిన ఆయన తీరా ఎన్నికల రిజల్ట్ వచ్చాక ఖంగు తిన్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో ఒకే ఒక్కడు గెలిచాడు.  

 

ట్విస్ట్ ఏంటంటే జనసేన అధినేతగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాన్ దారుణంగా ఓడిపోచారు.  ఇక ఎన్నిల ఫలితాల తర్వాత జనసేన లో ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు.  ఎందుకు ప్రజల హృదయాలు గెల్చుకోలేక పోయామన్న విషయంపై పోస్ట్ మార్టం చేయడం మొదలు పెట్టారు పవన్ కళ్యాన్.  ఈలోగా పార్టీ నుంచి కొంత మంది వైసీపీ తీర్థం పుచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సొంత పార్టీ నేత షాకిచ్చారు. పవన్ కుల మతాలను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారని.. ఆ పార్టీ క్రైస్తవ సంఘం నేత అలివర్ రాయ్ విశాఖలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఈ నేపథ్యంలో సెక్షన్‌లు 298, 504, 295A,153A,505,334 కింద కేసు నమోదు చేయాలని కోరారు. విజయవాడ పున్నమిఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కుల ,మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని రాయ్ ఆరోపించారు. ఎవరి ఇష్టంతో వారు మతం మారితే.. ఎలా విరుద్ధమో పవన్ కళ్యాణ్ చెప్పాలి అన్నారు. కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయి అన్నారు. పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని.. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: