కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటిస్తున్నాడు. అయితే ఈ పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... మన భారత దేశ నేర పరిస్థితుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఉన్నావ్ లో జరిగిన ఘటన.. హైదరాబాదులో జరిగిన ఘటనను ఉద్దేశించి... మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులపై నేరాలు జరగడం ప్రతిరోజు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. అత్యాచార ఘటనలకు ప్రపంచ దేశాలన్నింటికీ... భారతదేశం రాజధానిగా మారిందన్నారు. ఇండియాలోని ప్రజలు తమ అక్కాచెల్లెళ్లను ఎందుకు కాపాడలేక పోతున్నారని ప్రపంచ దేశాల మీడియా ప్రశ్నిస్తున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.


ఒక ఉత్తర ప్రదేశ్ భాజపా ఎమ్మెల్యేకు... ఒక మహిళా అత్యాచారం కేసులో హస్తం ఉందని వెల్లడించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ అత్యాచార కేసు పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని... మౌనంగా ఉన్నారని... రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ నేతలు... ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారని, కొంతమంది వ్యక్తులు ఏకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు అని చెప్పాడు.

భారత దేశాన్ని పరిపాలించే వ్యక్తి హింస, విచక్షణారహిత విధానాల్ని విశ్వసిస్తాడు కాబట్టి ఈ దేశంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. హింస, ద్వేషంను నమ్మినప్పుడు... అవి రెండు తగ్గిపోతాయని మీరు ఊహించ కూడదని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇకపోతే రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన చేపట్టనున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వారు చేసిన విజ్ఞప్తికి రాహుల్ గాంధీ సమ్మతించి పార్టీలో మళ్లీ చేరేందుకు ఒప్పుకున్నారని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: