తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. సుబేదారీ స్టేషన్ పోలీసులు యువతి చిన్నాన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.  24 ఏళ్ల యువతి మిస్సింగ్ గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైంది. శాయంపేట పరిధిలోని కేసు సుబేదారీ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. యువతి చిన్నాన్న ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు. 
 
నిన్న సాయంత్రం నుండి యువతి కనిపించటం లేదని సమాచారం. యువతి బంధువుల ఇంటికి వెళ్లిందని తల్లిదండ్రులు మొదట భావించారు. కానీ బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. గోవిందాపూర్ కు చెందిన యువతి కుటుంబ సభ్యులు శాయంపేట పరిధిలోకి వస్తారు. సుబేదారీ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసును శాయంపేట పోలీసులకు బదిలీ చేశారు. 
 
శాయంపేట పోలీసులు, సుబేదారీ పోలీసులు యువతి మిస్సింగ్ గురించి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులను వరంగల్ సీపీ అభినందించారు. హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్య కేసుతో జీరో ఎఫ్ఐఆర్ తెర మీదకు వచ్చింది. పోలీసుల ఆలసత్వం కూడా దిశ ఘటనకు ఒక కారణం కావటంతో పోలీసుల నిర్లక్ష్యంపై భారీగా విమర్శలు వచ్చాయి. 
 
ఏపీలో రెండు రోజుల క్రితం తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు కాగా తెలంగాణలో ఈరోజు నమోదైంది. పోలీసు శాఖ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకనుండి ఫిర్యాదు చేసేందుకు ఏ పోలీస్ స్టేషన్ కు వచ్చినా తమ పరిధి కాదంటూ పోలీసులు వెనక్కు పంపడానికి వీలు లేదు. ఏపీలో అమరావతి పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు కాగా కృష్ణా జిల్లా కంచికకర్లలో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: