దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాష్ట్ర రాజకీయాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా మహారాష్ట్ర రాజకీయాలని చెప్పాలి. గత అక్టోబర్ నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని దాదాపు నెల రోజులు ఉత్కంఠ నడిచింది. కానీ ఆ ఉత్కంఠ వీడి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే- ఎన్సీపీ- కాంగ్రెస్ తో జత కట్టి సీఎం పదవిని అధిష్టించారు.

 

 ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన బీజేపీ శివసేన ఎన్నికల తర్వాత శివసేన బిజెపికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. దీనికి కారణం సీఎం పదవిని చెరి సగం కాలం పంచుకోవాలని షరతు. కానీ బీజేపీ వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. దీనితో వారు ఆ కూటమి నుంచి పక్కకు వచ్చారు. ఈ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా శివసేన- బిజెపి కలిపి కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లు కూడా వీరు విజయం సాధించారు.

 

 మహారాష్ట్ర సిఎంగా ఉద్దవ్ ఠాక్రే  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహారాష్ట్రకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ముంబై వెళ్లారు. ఒక అధికారిక కార్యక్రమం కోసం ముంబై చేరుకున్న ప్రధాని నీ మహారాష్ట్ర గవర్నర్ తో పాటు కలిసి స్వాగతం పలికారు ఉద్దవ్ ఠాక్రే. ముంబై విమానాశ్రయంలోనే వీరిద్దరు కూడా కాసేపు పలు అంశాలపై చర్చించారు అని తెలుస్తుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అని కోరినట్లు తెలుస్తుంది.

 

ఎయిర్ పోర్ట్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అలాగే మహారాష్ట్ర బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రధానిని ఆహ్వానించారు. ఐతాంత ఉత్కంఠగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఉద్దవ్ ఠాక్రే ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. అన్నదమ్ములు ఎందుకు అంటే శివసేన వాళ్లు బీజేపీ ప్రభుత్వాని పెద్ద అన్నగా పిలిచారు ఇంతకముందు. 

మరింత సమాచారం తెలుసుకోండి: