ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కయ్యి.. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో మాఫియా రాజ్యం ఏలుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం సృష్టించాయి. దింతో ఈ వ్యాఖ్యలపై వైసీపీ హైకమాండ్ స్పందించింది. 

 

సీఎం జగన్ నేరుగా ఎంట్రీ ఇవ్వకుండా విజయసాయి రెడ్డి ద్వారా ఆనంకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. జగన్ కనీసం వివరణ కూడా అడక్కుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా జాగ్రత్త అంటూ విజయసాయిరెడ్డి ద్వారా ఆనం రామనారాయణ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు వైసీపీలో చేరిన సందర్భంగా నెల్లూరు నేతలతో జగన్ సమావేశమయ్యారు. 

 

ఇందులో భాగంగానే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో మాఫియాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన వద్ద ప్రస్తావనకు వచ్చాయి. దీంతో ఈ విషయంపై అప్పటికే ఆగ్రహంతో ఉన్న సీఎం జగన్ విజయసాయిరెడ్డితో కోపంగా మాట్లాడారని సమాచారం.. అంతేకాదు గతంలో ఆనం రామనారాయణ రెడ్డి విజయసాయిరెడ్డి ద్వారానే వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లాతో విజయసాయికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనతోనే ఆనం మంతనాలు సాగించేవారు.

 

మంత్రి పదవి దక్కలేదన్న ఉక్రోషం ఓవైపు, తనకంటే చిన్నవారికి మంత్రి పదవి వచ్చిందన్న కడుపు మంట మరోవైపు, తన మూలాలు కదులుస్తున్నారన్న అనుమానం మరోవైపు.. వెరసి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో మాఫియాలంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఆనం మాట్లాడిన వీడియో ఫుటేజీ రాత్రే జగన్ కు చేరింది. దీంతో ఇష్టముంటే పార్టీలో ఉండమనండి, లేదంటే లేదు అని విజయసాయిరెడ్డి దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారట జగన్. 

 

కాగా ఈ మధ్యనే ఆనం రామనారాయణ రెడ్డి ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు నాయుడుని కలిసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను పార్టీపై ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారని రాజకీయవర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ షోకాజ్ తో నెల్లూరులో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: